Nara Lokesh: జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ.. వైఎస్సార్సీపీ అధినేతపై నారా లోకేశ్ సంచలన కామెంట్స్

కడప పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్(Nara Lokesh) మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ ఘాటుగా విమర్శించారు.

Jagan is a cancerous growth afflicting Kadapa Nara Lokesh sensational comments

  • జగన్ కడపకు క్యాన్సర్ గడ్డ
  • బాబాయిని చంపింది జగనేనని ఆరోపణ
  • బ్రాహ్మణీ భూములు స్వాధీనం చేసుకుంటాం

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు, ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Noida Fire Incident: ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. నోయిడాలో ఘోరం

కడప పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ ఘాటుగా విమర్శించారు. సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది జగనే అని తాను గతంలో పాదయాత్రలో చెప్పానని, ఈరోజు కూడా అదే మాటపై నిలబడుతున్నానని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అనేది కేవలం ‘హిట్ అండ్ రన్’ పార్టీ అని దుయ్యబట్టారు. గతంలో జగన్ కారు టైర్ల కింద నలిగి ఒకరు చనిపోయినా వారికి ఇలాంటి ఘోరాలు చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణీ స్టీల్స్ పేరుతో గతంలో 11 వేల ఎకరాలను ఎకరా కేవలం రూ. 19 వేలకే కేటాయించారని, దీనివల్ల గాలి జనార్దన్ రెడ్డి, జగన్ మాత్రమే లబ్ధి పొందారని ఆరోపిస్తూ.. ఆ భూములను చట్టపరంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ప్రకటించారు.

జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని లోకేశ్ ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో 250 మంది మత్స్యకారులు చనిపోతే ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదని, కానీ తమ కూటమి ప్రభుత్వం ఇటీవల చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందించిందని గుర్తుచేశారు. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేసి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, తమ ప్రభుత్వం రాగానే 16 వేల టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని, త్వరలోనే మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తామని లోకేశ్(Nara Lokesh) స్పష్టం చేశారు.