AP Local Body Elections : లోకల్ ఎలక్షన్స్‌పై పవన్ స్పెషల్ ఫోకస్.. రంగంలోకి ఐదుగురు సభ్యుల కమిటీ!

AP Local Body Elections : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నాహాలను ముమ్మరం చేసింది.

Janasena chief Pawan Kalyan

AP Local Body Elections : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నాహాలను ముమ్మరం చేసింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరించి, పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఎప్పటికప్పుడు నివేదించేందుకు ఐదుగురు సభ్యులతో ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు.

Also Read: Jantar Mantar 2.0 : జంతర్‌మంతర్ 2.0 లోడింగ్.. సీఈసీ రాజీనామా చేయాలంటూ సీజేపీ డెడ్‌లైన్.. లేదంటే.. డిమాండ్లు ఇవే..

ఈ కమిటీలో APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, భీమవరం నియోజకవర్గానికి చెందిన పులపర్తి ప్రశాంత్, రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన యనమల భాస్కర్ సభ్యులుగా ఉంటారు.

ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం 14 మంది సభ్యులతో ఒక సమన్వయ కమిటీ పనిచేస్తోంది. ఈ కొత్త ఐదుగురు సభ్యుల కమిటీ ఆ కమిటీతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించనుంది. అందిన సమాచారాన్ని అధ్యయనం చేసి, ఎన్నికల పరిస్థితులపై నివేదికలను పార్టీ అధ్యక్షుడికి అందించనుంది.

ఈ నివేదికల ఆధారంగా పవన్ కల్యాణ్ కమిటీ సభ్యులతో ప్రతిరోజూ సమీక్ష నిర్వహించనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ శ్రేణులకు ఇవ్వాల్సిన దిశానిర్దేశంపై ఈ సమీక్షల్లో చర్చించనున్నారు.

అలాగే గతంలో ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ కమిటీలో కొన్ని మార్పులు చేయాలని పవన్ కల్యాణ్ సూచించినట్లు జనసేన వర్గాలు తెలిపాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని మరింత సమన్వయంతో సిద్ధం చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.