Janasena petition : పరిషత్ ఎన్నికలను సవాల్ చేస్తూ హైకోర్టులో జనసేన పిటిషన్

ఏపీ పరిషత్‌ ఎన్నికలపై హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ జనసేన హౌస్‌మోషన్‌ పిటిషన్‌ వేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దు చేయాలని కోరింది.

Janasena House Motion petition : ఏపీ పరిషత్‌ ఎన్నికలపై హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ జనసేన హౌస్‌మోషన్‌ పిటిషన్‌ వేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దు చేయాలని కోరింది. నోటిఫికేషన్‌ సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉందని జనసేన అంటోంది. ఇప్పటికే పరిషత్‌ ఎన్నికలపై బీజేపీ పిటిషన్ వేసింది. ఈ రెండు పిటిషన్లపై మధ్యాహ్నం 2గంటల 15నిమిషాలకు హైకోర్టులో విచారణ జరగనుంది.

నిన్న జరిగిన అఖిల పక్ష సమావేశానికి వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం ప్రతినిధులు హాజరయ్యారు. పరిషత్ ఎన్నికలపై ఎస్‌ఈసీ నీలం సాహ్నికి విడివిడిగా తమ అభిప్రాయాలు చెప్పారు. మరోవైపు ఎస్‌ఈసీ తీరుకు నిరసనగా అఖిలపక్ష సమావేశాన్ని ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ బహిష్కరించాయి.

మరోవైపు ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. 2021, ఏప్రిల్ 8 గురువారం రోజున పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 10వ తేదీన ఫలితాలు వెల్లడిచేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎస్ఈసీగా 2021, ఏప్రిల్ 1 గురువారం రోజున బాధ్యతలు తీసుకున్న రోజే…ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం. అవసరమైన చోట్ల ఈనెల 9న రీపోలింగ్ నిర్వహించనుంది.

ట్రెండింగ్ వార్తలు