JC Prabhakar Reddy : రాజశేఖర్ రెడ్డి వల్లనే మున్సిపల్ చైర్మన్ అయ్యా – జేసీ ప్రభాకర్ రెడ్డి
శుక్రవారం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన రాజశేఖర్ రెడ్డి వలన తాను మున్సిపల్ చైర్మన్ అయ్యానని, చంద్రబాబు వలన ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. తాడిపత్రికి దేశంలోనే స్వచ్ఛమైన మునిసిపాలిటీగా తీర్చిదిద్దానని చెప్పారు జేసీ.
- kunduru Vinod
- Published On : July 16, 2021 / 01:00 PM IST
Jc Prabhakar Reddy
JC Prabhakar Reddy : శుక్రవారం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన రాజశేఖర్ రెడ్డి వలన తాను మున్సిపల్ చైర్మన్ అయ్యానని, చంద్రబాబు వలన ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. తాడిపత్రికి దేశంలోనే స్వచ్ఛమైన మునిసిపాలిటీగా తీర్చిదిద్దానని చెప్పారు జేసీ.
టీడీపీ బలోపేతనానికి తాను కృషి చేస్తానని తెలిపారు. త్వరలో పదివేలమందితో తాడిపత్రిలో సభ పెడతానని వివరించారు. టీడీపీ అంటే తనకు చాలా అభిమానమని.. ఒకవేళ తనను చంద్రబాబు సస్పెండ్ చేసినా.. నేను ఆ పార్టీ నుంచి వెళ్లనని, పార్టీకోసం పనిచేస్తానని తెలిపాడు. కొందరు పార్టీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించాడు జేసీ. ఇక తనకు ఎమ్మెల్యే పింఛన్ రావడం లేదని వివరించాడు.
గత 9 నెలలుగా తన పింఛన్ డబ్బు జమ కావడం లేదని వివరించారు. ఎవరైనా ఆరోగ్యం బాలేదని తన వద్దకు వస్తే ఆ పింఛన్ డబ్బులు వారికి ఇస్తానని, పింఛన్ డబ్బు రాకపోవడంతో సాయం చెయ్యలేక పోతున్నానని తెలిపారు. టీడీపీని బలోపేతం చేయడానికి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి ఎవరినైనా ఎదిరిస్తానని ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇదే సమయంలో అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. మెసెజ్ చేసిన పాపానికి టీడీపీ కార్యకర్తను జైల్లో పెట్టారని, ఇది అత్యంత దారుణమని తెలిపారు.
