Greenfield Highway: 2 గంటల్లోనే తిరుపతి ప్రయాణం.. సిద్దమవుతున్న 4 లేన్స్ కొత్త హైవే.. ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్

Kadapa-Renigunta Greenfield Expressway Highway: కడప-రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే పనులు శరవేగంగా ప్రారంభమవడంతో ప్రయాణ సమయం 2 గంటలకు తగ్గి శ్రీవారి భక్తులకు తీవ్ర ఉపశమనం లభించనుంది.

Kadapa renigunta greenfield expressway nh716 works speed up tirupati travel time

Kadapa-Renigunta Greenfield Expressway Highway: ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు, తిరుమల శ్రీవారి భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రూ.2,254 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న 122 కిలోమీటర్ల కడప-రేణిగుంట నాలుగు లైన్ల గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం చొరవతో అటవీ శాఖ అనుమతులు, భూసేకరణ, పరిహారం పంపిణీ ప్రక్రియ పూర్తి కావడంతో కడప జిల్లా పరిధిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Read Also – Amit Shah: భాగ్యలక్ష్మి అమ్మవారి సేవలో అమిత్‌షా.. నేడు హైదరాబాద్‌లో బీజేపీ ‘మహా పాదయాత్ర’

2 గంటల్లోనే రేణిగుంట.. శ్రీవారి భక్తులకు తప్పనున్న రోడ్డు తిప్పలు:

ప్రస్తుతం కడప నుంచి రేణిగుంట వెళ్లడానికి గుంతల రోడ్లు, ప్రమాదకర మలుపుల వల్ల దాదాపు 4 గంటల సమయం పడుతోంది. అయితే, గంటకు 100 కి.మీ గరిష్ట వేగంతో రూపొందిస్తున్న ఈ కొత్త ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయితే కేవలం 2 గంటల్లోనే రేణిగుంటకు, అలాగే రెండున్నర గంటల్లో తిరుపతికి చేరుకోవచ్చు. రైల్వే కోడూరు-రేణిగుంట మార్గంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ప్రమాదాలను నివారించేలా ఆధునిక సాంకేతికతతో రహదారిని విస్తరిస్తున్నారు.

2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి.. ఎన్‌హెచ్‌ఏఐ నిర్దేశిత గడువు:

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ ప్రాజెక్ట్‌ను 2027 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైల్వే కోడూరు నుంచి రేణిగుంట మార్గంలో చెట్ల తొలగింపు పనులు వేగవంతం కాగా, చెన్నై-కడప మార్గంలో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలకు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే శాశ్వత పరిష్కారం చూపనుంది.