Ambati Rambabu: వైకాపా నేత అంబటి రాంబాబుకి షాక్.. కిర్లంపూడి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు

వైకాపా కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు.

Kirlampudi police issued notices to YCP leader Ambati Rambabu.

Ambati Rambabu: వైకాపా కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 8వ తేదీన విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. గత జులై 16న ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరిగిన వైకాపా సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సమయంలో చోటుచేసుకున్న ఉద్రిక్త సంఘటనలకు సంబంధించి ఈ చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో అంబటి రాంబాబు అంత్యక్రియల ప్రక్రియను అడ్డుకోవడమే కాకుండా, విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకుని ముందుకు నెట్టివేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది.

Amaravati ORR: అమరావతి ORR డిజైన్లలో కీలక మార్పులు.. రూ.7,959 కోట్లు ఆదా.. కొత్త రూట్ మ్యాప్ ఇదే!

వేరే పనులున్నాయన్న అంబటి.. ఉత్కంఠగా మారిన విచారణ:

పోలీసులు ఇచ్చిన నోటీసులపై మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)స్పందిస్తూ.. ఈ నెల 8న తనకు ముందే ఖరారైన ఇతర ముఖ్యమైన పనులు ఉన్నాయని వెల్లడించారు. అందువల్ల ఆ రోజు విచారణకు హాజరుకాలేనని, త్వరలోనే తాను ఎప్పుడు విచారణకు వస్తానో పోలీసులకు తెలియజేస్తానని స్పష్టం చేశారు. అయితే, ముద్రగడ అంత్యక్రియల వద్ద జరిగిన ఆందోళనపై విచారణ వేగవంతం కావడం, అంబటి రాంబాబు నోటీసులపై ఆచితూచి అడుగులు వేస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వ్యవహారం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.