విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచిన లలితా జ్యువెలర్స్ అధినేత

లలిత జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు.

Lalithaa Jewellery kiran kumar: లలిత జ్యువెలర్స్ యజమాని కిరణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. సోమవారం విజయవాడలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని ఆయన కలిశారు. వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా లలిత జ్యువెలర్స్ అధినేతను సీఎం చంద్రబాబు అభినందించారు.

తర్వాత కిరణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడిని ప్రశంసలతో ముంచెత్తారు. ఏపీ ప్రజల శ్రేయస్సు కోసం సీఎం చంద్రబాబు 75 ఏళ్ల వయసులో కష్టపడుతున్నారు. ఇంటికి కూడా వెళ్ళకుండా బస్సులో ఉంటూ వరద బాధితులను ఆదుకోవడం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఎవరికి తోచిన సాయం వారు చేయాలి. డబ్బులు ఎవరికీ ఊరికే రావు.. ఎవరికి తోచినంత వారు సాయం అందిస్తే ప్రభుత్వానికి తోడ్పాటుగా ఉంటుందని కిరణ్ కుమార్ అన్నారు. కాగా, వరద బాధితుల సహాయార్థం టీడీపీ నేత అంగర్ రామ్మోహన్ రావు విరాళం అందించారు. విజయవాలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి 5 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. ఆయనను సీఎం చంద్రబాబు అభినందించారు.

విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబును కలిసి ఆదివారం పెద్ద ఎత్తన విరాళాలు అందించిన వారి వివరాలు..

1. ఏపీ పోలీస్ అధికారుల సంఘం రూ.11 కోట్ల 12 లక్షల 50 వేలు
2. దీపక్ నెక్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఏవీ సుబ్రహ్మణ్యం రూ.1 కోటి
3. వాటర్ సప్లై కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రూ.50 లక్షలు
4. వై. రాజారావు రూ.10 లక్షలు
5. కె. సాంబశివరావు రూ.5 లక్షలు

6. సీహెచ్ పూర్ణ బ్రహ్మయ్య రూ.5 లక్షలు
7. డాక్టర్ శరత్ బాబు రూ.5 లక్షలు
8. సి.టీ.చౌదరి రూ.2 లక్షల 55 వేలు
9. శ్రీ కోవిల్ ఫ్లాట్స్ ఒనర్స్ రెసిడెంట్ అసోసియేషన్ రూ.2 లక్షల 21 వేల 116
10. వెలగపూడి సత్యనారాయణ రూ.2 లక్షల 116

11. ఎమ్.శ్రీనివాసరావు రూ.2 లక్షలు
12. పువ్వాడ రామకృష్ణ రూ.2 లక్షలు
13. సీహెచ్.శివరామ్ కృష్ణ రూ.1 లక్షా 32 వేలు
14. బి.నవీన్ బాబు రూ.1 లక్షా 116
15. జాస్తి శైలజారాణి రూ.1 లక్ష

16. జె.శాంభవి రూ.1 లక్ష
17. జె.శశాంక్ చౌదరి రూ.1 లక్ష
18. ఎస్.సాంబశివరావు రూ.1 లక్ష
19. ధూలిపాళ్ల రామకృష్ణ రూ.1 లక్ష
20. డాక్టర్ యు.గంగాధర్ రెడ్డి రూ.1 లక్ష

Also Read : సీఎం చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు

21. చెరుకూరి వెంకటరావు రూ.1 లక్ష
22. జె.సత్యనారాయణ మూర్తి రూ.1 లక్ష
23. ఏపీ ప్రదేశిక్ మార్వాడి సమ్మేళనం రూ.1 లక్ష

ట్రెండింగ్ వార్తలు