Love Couple Suicide : పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమ జంట ఆత్మహత్య
కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ముసునూరు మండలంలో చోటు చేసుకుంది.
- bheemraj
- Published On : November 21, 2021 / 04:38 PM IST
Suicide
Love couple commit suicide : కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పరుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ముసునూరు మండలం లోపూడి గ్రామంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా లోపూడి గ్రామానికి చెందిన లీకుమారి, పశ్చిమగోదావరి జిల్లా ఎర్రవారిగూడెంకు చెందిన అనిల్ కుమార్ ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో పెళ్లికి నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
Rains : తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
స్థానికులు గమనించి వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. దీంతో రెండు గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. వీరి మృతితో ఇరువురి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
