AP Jobs Age Limit: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు.. ప్రభుత్వ కీలక ఉత్తర్వులు!

AP Jobs Age Limit: ఆంధ్రప్రదేశ్ (AP Government) రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వయోపరిమితి సడలింపు ప్రతిపాదనపై కీలక నిర్ణయం తీసుకుంది.

Maximum Age Limit Increased From 34 To 44 Years For Non Uniform Posts in ap

  • ఏపీలో ఉద్యోగాల వయోపరిమితి పెంపు
  • 44 ఏళ్లకు ఏజ్ లిమిట్
  • 2027 వరకు జీవో అమలు

AP Government Jobs Age Limit: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగార్థులకు అద్భుతమైన శుభవార్త అందించింది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వయోపరిమితి సడలింపు ప్రతిపాదనపై కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ (APPSC) తో పాటు వివిధ నియామక సంస్థల ద్వారా చేపటే నాన్-యూనిఫాం ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు గరిష్ట వయోపరిమితిని గణనీయంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also – Rajasthan Municipal Election: రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం.. ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్!

10 ఏళ్ల సడలింపు.. భారీ ఊరట:

ఇప్పటివరకు నాన్-యూనిఫాం పోస్టుల భర్తీకి గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లుగా ఉండగా, దానిని ఏకంగా 44 ఏళ్లకు పెంచారు. ఈ 10 సంవత్సరాల అదనపు వయోపరిమితి సడలింపు 2027 సెప్టెంబర్ 30 వరకు వెలువడే నోటిఫికేషన్లకు అమల్లో ఉంటుంది. దీనికి అదనంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు ప్రస్తుతం అమలులో ఉన్న రిజర్వేషన్ సడలింపులు యథావిధిగా వర్తిస్తాయి.

ఆ ఉద్యోగాలకు మినహాయింపు:

అయితే ఈ ప్రత్యేక వయోపరిమితి పెంపు అన్ని ఉద్యోగాలకు వర్తించదని ప్రభుత్వం (AP Jobs Age Limit) స్పష్టం చేసింది. పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైళ్లు, అటవీ, రవాణా శాఖలకు చెందిన యూనిఫాం పోస్టులకు, భౌతిక ప్రమాణాలు తప్పనిసరి అయిన ఉద్యోగాలకు ఈ సడలింపు వర్తించదు. ఆయా ఉద్యోగ ప్రకటనల్లో పేర్కొనే నిబంధనలను అభ్యర్థులు పరిశీలించాల్సి ఉంటుంది.