AP Rains : ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ.. ఈ సూచనలు పాటించండి..
AP Rains : ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
- Harish Thanniru
- Published on- June 11, 2026 / 06:46 AM IST
AP Rains
- ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
- హెచ్చరికలు జారీ చేసిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
- భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం
AP Rains : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read : Telangana Rains : తెలంగాణకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో మూడ్రోజులు వర్షాలు.. భీకర గాలులు.. హెచ్చరికలు జారీ..
మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉన్న కారణంగా గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలతోపాటు, భారీ స్థాయిలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేశారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండొద్దని, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ ల వద్ద ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్ల్లోకి వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
