Ap Rains: ఏపీ వ్యాప్తంగా భారీ వర్ష సూచన.. మత్స్యకారులకు హెచ్చరిక.. అన్ని తీర ప్రాంతాల్లో హైఅలర్ట్!
రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు(Ap Rains) కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
- V Santhosh Kumar
- Updated on- August 23, 2026 / 08:54 PM IST
Meteorological Department issued warning heavy rains across ap next two days.
- బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం
- తీరం దాటనున్న ఈదురుగాలులు
- ఉత్తరాంధ్ర జిల్లాలకు హెచ్చరికలు
Ap Rains: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి. దీని ప్రభావంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడన తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఈ క్రమంలో ప్రజలతో పాటు మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
Nagarkurnool Incident: వర్షాలు పడటం లేదని.. శవాన్ని బయటకు తీశారు.. నాగర్‌కర్నూల్‌లో షాకింగ్ సంఘటన
సముద్రం అల్లకల్లోలం, మత్స్యకారులకు హెచ్చరికలు:
ప్రస్తుత అల్పపీడనం కారణంగా సముద్రం తీవ్ర అలజడిగా మారి అలలు భారీగా ఎగసిపడే అవకాశం ఉంది. ఈ విపత్కర పరిస్థితుల దృష్ట్యా వేటకు వెళ్లడం ఏమాత్రం సురక్షితం కాదని అధికారులు తెలిపారు. మంగళవారం వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల విజ్ఞప్తి:
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు (Ap Rains)కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే సమయంలో బయట ఉండే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ముఖ్యంగా బలమైన గాలుల ధాటికి ప్రాణనష్టం జరగకుండా చెట్లు, భారీ హోర్డింగుల కింద నిలబడకూడదని స్పష్టం చేశారు. వాతావరణంలో సంభవిస్తున్న ఈ మార్పుల దృష్ట్యా ప్రజలంతా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
