సీఎం జగన్ ప్లెక్సీకి కల్లుతో అభిషేకం!

  • Publish Date - May 3, 2020 / 12:38 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో సీఎం జగన్ కు కల్లుతో అభిషేకం చేశారు. గీత కార్మికులకు మేలు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.46 పై హర్షం వ్యక్తం చేస్తూ రాజమహేంద్రవరంలో సీఎం జనగ్ ప్లెక్సీకి మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ భరత్ అభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ జీవో నెంబర్ 46 ప్రకారం గీత కార్మికులకు వెసులుబాటు కల్పించామని తెలిపారు. కంటికి కనిపించని శత్రువుతో మనం పోరాడుతున్నామని చెప్పారు. 

ఈ మహమ్మారి వైరస్ రాష్ట్రంలో విస్తరించకుండా ఆపేందుకు పలు వృత్తులకు ఆటంకం కల్పించామని తెలిపారు. అందుకే కొన్ని రోజులపాటు కల్లు గీతపై నిషేధం విధించామని చెప్పారు.

కల్లుగీత కార్మికుల వృత్తికి ఆటంకం కల్గించడం బాధాకరమైనప్పటికీ ఈ వ్యాధి మన రాష్ట్రంలో ప్రబలకూడదనేదే ముఖ్యమంత్రి జగన్ ప్రధాన ఉద్దేశం అన్నారు. సీఎం ఏం చేసినా అది ప్రజల గురించి అన్న మాట గుర్తుపెట్టుకోవలన్నారు. ప్రభుత్వం తరపు నుంచి మీ అందరి దగ్గరి నుంచి క్షమాపణలు వేడుకుంటున్నట్లు తెలిపారు.