Nara Lokesh: రప్పా.. రప్పా అంటే ఊరుకోం.. మంత్రి లోకేశ్ ఫైర్.. రెడ్ బుక్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు
లోకేశ్ (Nara Lokesh)మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లభించిందని అన్నారు.
- V Santhosh Kumar
- Published on- June 12, 2026 / 03:40 PM IST
Minister Nara Lokesh sensational comments on Red Book and the YSRCP party
- రెండేళ్ల పాలనపై లోకేశ్ వ్యాఖ్యలు
- వైకాపాపై తీవ్ర విమర్శలు గుప్పింపు
- రెడ్ బుక్‌పై సంచలన హెచ్చరికలు
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతి సమీపంలోని దామినేడులో ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీయెన్ మాధవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ (Nara Lokesh)మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లభించిందని అన్నారు. ఈ కాలంలో జేసీబీలు, దాడులు, హత్యలు, బూతుల రాజకీయాలు కనిపించలేదని పేర్కొన్నారు.
Skywalk Lift: మెట్రో లిఫ్ట్‌లో చిక్కుకున్న యువకుడు.. గంటల పాటు ఉత్కంఠ.. చివరకు ఎలా బయటపడ్డాడంటే?
గత వైకాపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన లోకేశ్, ఆ పాలనలో అనేక అరాచకాలు జరిగాయని ఆరోపించారు. మాస్క్ అడిగినందుకు ఓ దళిత వైద్యుడిని హత్య చేసిన ఘటన, డ్రైవర్ సుబ్రమణ్యం హత్య వంటి సంఘటనలను ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ జెండా లేకుండా చేస్తామని గతంలో వైకాపా నేతలు చెప్పారని, అయితే ఇప్పుడు ప్రజలే వైకాపా జెండాను పీకేశారని వ్యాఖ్యానించారు. ‘‘రప్పా.. రప్పా అంటే చూస్తూ ఊరుకునేది లేదు. రెడ్ బుక్ దాని పని అది చేసుకుంటూ పోతుంది’’ అంటూ హెచ్చరికలు కూడా చేశారు.
ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామని లోకేశ్ తెలిపారు. రాయలసీమపై N. T. Rama Raoకు ఉన్న ప్రేమను గుర్తు చేస్తూ, కరవు సమయంలో ప్రజలకు అండగా నిలిచారని చెప్పారు. మహిళల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే రాయలసీమ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర కీలకమని కొనియాడారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రజా ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకుందని లోకేశ్ పేర్కొన్నారు.
