Minister RK Roja : తోక పార్టీలన్నీ కలిసినా జగన్ను ఏమి చేయలేవు.. మళ్లీ నగరి నుంచే పోటీ చేస్తా!
Minister RK Roja : చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్ని తోక పార్టీలు కలిసొచ్చినా కూడా జగన్మోన్ రెడ్డిని ఏం చేయలేవన్నారు.
- Sreehari A
- Updated on- February 8, 2024 / 11:34 PM IST
Minister Roja Satirical Comments on Chandrababu Naidu and Pawan Kalyan
Minister Roja : ఏపీలో ప్రతిపక్ష పార్టీ నేతలైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్ని తోక పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేమని అన్నారు.
గురువారం (ఫిబ్రవరి 8న) తిరుపతి నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమెకు అక్కడి అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి మంత్రి రోజా రోడ్డు మార్గాన నోవాటెల్ హోటల్‌కి బయల్దేరివెళ్లారు.
Read Also : Telangana Final Voters List : తెలంగాణలో ఫైనల్ ఓటర్ల జాబితా విడుదల.. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు ఎందరంటే?
విశాఖ రైల్వే స్టేడియంలో శుక్రవారం (ఫిబ్రవరి 9న) జరగబోయే ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్ టీడీపీని జాకీలు పెట్టి లేపినా ఆ జాకీలు విరిగిపోతున్నాయని ఎద్దేవా చేశారు.
నగరి నుంచే మళ్లీ పోటీ చేస్తా :
రాబోయే ఎన్నికల్లో తాను సీఎం జగన్ ఆశీస్సులతో మళ్లీ నగరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని రోజా స్పష్టం చేశారు. తోకపార్టీలన్నీ కలిసినా జగన్ను ఏమి చేయలేరని ఆమె మండిపడ్డారు. అంతేకాదు.. చంద్రబాబు, సోనియాగాంధీ అమిత్ షా వంటి వారిని ఎన్నిసార్లు కలిసినా జగన్‌ను కొంచెం కూడా తాకలేరన్నారు. గట్స్ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మంత్రి రోజా పేర్కొన్నారు.
విశాఖ రైల్వే గ్రౌండ్ వేదికగా ‘ఆడుదాం ఆంధ్రా’ ఫైనల్స్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంభ వేడుకలను మంత్రి రోజా ప్రారంభించనున్నారు. అయితే, ఈ పోటీల్లో మొత్తం 5 కేటగిరీల్లో మూడు వేల మంది వరకు క్రీడాకారులు పాల్గొననున్నారు.
Read Also : బీఆర్ఎస్‌కు మరో షాక్..? కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి?
