×
Ad

MLA Roja : కుప్పం ఎన్నికల్లో తుప్పు, పప్పులను తరిమికొడతారు : రోజా

లోకేష్ కుప్పం పర్యటనపై నగరి ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకేష్ వ్యాఖ్యలకు రోజా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కుప్పం ఎన్నికల్లో తుప్పు, పప్పులను ప్రజలే తరిమికొడతారన్నారు.

  • Published On : November 13, 2021 / 04:25 PM IST

Mla Roja Comments On Nara Lokesh Kuppam Tour

MLA Roja Comments : ఏపీలో మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జగన్ సర్కార్‌పై టీడీపీ నేత నారా లోకేష్ విమర్శలు చేస్తుంటే.. వైసీపీ నేతలు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. లోకేష్ కుప్పం పర్యటనపై నగరి ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకేష్ వ్యాఖ్యలకు రోజా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన లోకేష్ వీధి రౌడిలా మాట్లాడుతున్నాడని చురకలంటించారు. వరుస ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నా ఇంకా లోకేష్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

నారా కుటుంబం ఎవ్వరూ కుప్పంను పట్టించుకోలేదని విమర్శించారు. కోవిడ్ సమయంలోనూ కుప్పం వాసులను వాళ్లు పట్టించుకోలేదని రోజా మండిపడ్డారు. వైఎస్ జగన్ కుప్పం కష్టాన్ని పట్టించుకున్నారని అన్నారు. కానీ, చంద్రబాబు, జగన్ పాలనను కుప్పం వాసులు బేరీజు వేసుకుంటున్నారని రోజా చెప్పారు. జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకోవడం వల్ల అన్ని ఎన్నికల్లో వారికి ఓటమి పాలయ్యారని విమర్శించారు.

రాబోయే కుప్పం ఎన్నికల్లో తుప్పు, పప్పులను ప్రజలు తరిమికొడతారని రోజా విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌లు వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డబ్బులు, మద్యం, క్యాంప్ రాజకీయాలకు తెర లేపింది చంద్రబాబు నాయుడేనని దుయ్యబట్టారు. కుప్పం ప్రజలు మునిసిపల్ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పనున్నారని రోజా అన్నారు.

చంద్రబాబు, లోకేష్‌ ఎన్ని ఆటలాడినా కుప్పం ఎన్నికల్లో వారికి ఓటమి తప్పదన్నారు. కుప్పం ఎన్నికల తర్వాత ఇద్దరికి రాసుకోడానికి చరిత్ర, చూసుకోడానికి భవిష్యత్ ఉండదని రోజా ఎద్దేవా చేశారు. గత పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీని తుంగలో తొక్కారని, ఇక మునిసిపల్ ఎన్నికలలో మురుగు కాలువల్లో ముంచి తీశారని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో తరిమితరిమి కొట్టారని అయినా టీడీపీ నేతలకు సిగ్గు రాలేదని రోజా విరుచుకుపడ్డారు.
Read Also : World Polluted Cities : ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీనే టాప్..!