Murasu Cyclone: తీరం దాటనున్న ‘మురసు’ తీవ్ర తుపాను.. అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే.. పలు రైలు సర్వీసులు రద్దు!

‘మురసు(Murasu Cyclone)’ తీవ్ర తుపాను ముప్పు నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ-గూడూరు, తెనాలి-రేపల్లె మార్గాల్లో పలు రైలు సర్వీసులను రద్దు చేసింది.

Murasu cyclone alert train cancelled on vijayawada guntur and tenali repalle route

Murasu Cyclone: బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న ‘మురసు’ తీవ్ర తుపాను కోస్తాంధ్ర తీరం వైపు వేగంగా దూసుకొస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఈ తీవ్ర తుపాను ప్రభావంతో ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ యంత్రాంగం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రయాణికుల భద్రతను దృష్ట్యా ముందస్తుగా పలు కీలక మార్గాల్లో రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Raptadu School: మూగబోయిన రాప్తాడు జెడ్పీ పాఠశాల.. గోపిక, లక్ష్మి ఘటన భయంలో విద్యార్థులు.. 350 మందికి ఐదుగురే!

విజయవాడ-గూడూరు, తెనాలి-రేపల్లె మార్గాల్లో రైళ్ల రద్దు.. ట్రాక్ వద్ద నిఘా:

తుపాను(Murasu Cyclone) తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న విజయవాడ – గూడూరు, తెనాలి – రేపల్లె మార్గాల్లో నడిచే పలు ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను సోమవారం, మంగళవారాల్లో పూర్తిగా రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని మళ్లించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి, సమాచారాన్ని నిరంతరం చేరవేస్తున్నారు.

అత్యవసర బృందాలు సిద్ధం.. సాధారణ స్థితి పునరుద్ధరణకు చర్యలు:

రైల్వే ట్రాక్‌లు, సిగ్నలింగ్ వ్యవస్థలపై తుపాను ప్రభావం పడకుండా ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలను రంగంలోకి దించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా ట్రాక్ రిపేర్ వాహనాలు, అత్యవసర యంత్రాలను సిద్ధంగా ఉంచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. తుపాను తీవ్రత తగ్గిన వెంటనే రైలు రాకపోకలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.