Pawan Kalyan Video: ఇండియా పేరు మార్పు.. చిరంజీవి, రాజమౌళి ఎదుట నిలబడి పవన్ చేసిన కామెంట్స్ వైరల్
పవన్ కల్యాణ్ ఆనాడే ఇండియా, భారత్ మధ్య తేడా ఏంటో చెప్పారని, ఆయన నిజమైన నాయకుడని..
- T Venkateshwarlu
- Updated on- September 5, 2023 / 04:42 PM IST
Pawan Kalyan
Pawan Kalyan Video- Bharat: ఇండియా పేరును కేంద్ర ప్రభుత్వం భారత్‌గా మార్చబోతుందని దేశ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోన్న వేళ దీనిపై చాలా మంది ప్రముఖులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. జనసేన (JanaSena) అధినేత పవన్ కల్యాణ్ మాత్రం 2019లోనే దీని గురించి తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. అప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
‘ఇండియా అనేది బ్రిటిష్ వారు పెట్టిన పేరు.. భారతదేశం అనేది మనది’ అని అదే అసలు పేరని పవన్ కల్యాణ్ అన్నారు. చిరంజీవి నటించిన సైరా నర్సింహారెడ్డి సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమంలో పవన్ ఈ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ ఆనాడే ఇండియా, భారత్ మధ్య తేడా ఏంటో చెప్పారని, నిజమైన నాయకుడని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
కాగా, సైరా నర్సింహారెడ్డి సినిమా 2019 అక్టోబరు 2న విడుదలైంది. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. ఇందులోనే ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు బిల్లు ప్రవేశపెడతారని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా భారత్ మాతా కీ జై అని ఇవాళ ట్వీట్ చేశారు.
