Nara Lokesh : జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ ఎవరి సినిమా ఫస్ట్ షో చూస్తారు? నారా లోకేశ్ అదిరిపోయే ఆన్సర్.. వీడియో వైరల్..
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఓ రాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానాలతో ఆకట్టుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ గురించి వచ్చిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
- Harish Thanniru
- Published on- June 30, 2026 / 12:49 PM IST
67 seconds with nara lokesh
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఓ రాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానాలతో ఆకట్టుకున్నారు. ’67 సెకండ్స్ విత్ నారా లోకేష్’ పేరుతో నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితం, రాజకీయాలు, ఆహారం, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు ప్రశ్నలకు ఆయన చమత్కారంగా స్పందించారు. కొన్ని ప్రశ్నలకు ‘రెండూ ఇష్టమే’ అంటూ సమాధానం ఇవ్వగా, మరికొన్నింటికి తనదైన శైలిలో జవాబిచ్చారు.
ఇద్దరు యువతులు ’67 సెకండ్స్ విత్ నారా లోకేష్’ కార్యక్రమంలో నారా లోకేష్‌కు వరుసగా రాపిడ్ ఫైర్ ప్రశ్నలు సంధించారు. ఈస్ట్ గోదావరి లేదా వెస్ట్ గోదావరి? ఏది ఇష్టం అనే ప్రశ్నకు లోకేశ్ రెండూ అంటూ సమాధానం ఇచ్చారు. రెండు జిల్లాల్లోనూ ఎంతో ప్రసిద్ధి చెందిన రుచికరమైన స్వీట్లు ఉన్నాయన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఫస్ట్ షోనా.. పవన్ కళ్యాణ్ ఫస్ట్ షోనా.. ఏది ముందు చూస్తారు అనే ప్రశ్నకు రెండూ చూస్తానంటూ లోకేశ్ సమాధానం ఇచ్చారు. దీంతో యువతి స్పందిస్తూ ఏదైనా ఒక్కటే ఎంచుకోవాలని కోరగా.. లోకేష్ నవ్వుతూ మళ్లీ “రెండూ” అనే సమాధానం ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు వీధి, పొట్టి శ్రీరాములు వీధి? ఈ రెండింటిలో దేనిని ఇష్టపడతారని ప్రశ్నించగా.. పొట్టి శ్రీరాములు వీధి అంటూ లోకేశ్ సమాధానమిచ్చారు. రాగి సంగటి లేదా హైదరాబాదీ బిర్యానీలో దేనిని ఎక్కువగా ఇష్టపడతారని అడుగ్గా.. రాగి సంగటి అంటూ లోకేశ్ వెంటనే చెప్పేశారు.
చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి కావాలా? లేక రాష్ట్రపతి కావాలా? అనే ప్రశ్నకు లోకేశ్ స్పందిస్తూ.. రెండూ కాదు అని సమాధానమిచ్చారు. ఆ వెంటనే.. అమరావతిలోనే ఆయన ఉండాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ పేరు వినగానే ఏమి గుర్తుకు వస్తుందని అడగగా.. మంచి ఆహారం అని చెప్పిన లోకేశ్.. AI అంటే “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. లవ్ అంటే నా భార్య అంటూ సమాధానమిచ్చారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురించి ఒక్క మాటలో చెప్పాలని అడుగగా.. ప్రజలు భావించే వ్యక్తిత్వానికి భిన్నంగా ఆయన ఉంటారు. వ్యక్తిగతంగా కలిసినప్పుడు అది అర్థమవుతుంది అంటూ లోకేశ్ చెప్పారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి అడుగగా.. ఇంకా ఎదగాల్సి ఉందని అన్నారు.
స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ. దేశ నిర్మాణంలో చాలా ముఖ్యమైన భాగం అని పేర్కొన్నారు. చివరగా 2029 అంటే ఏమి గుర్తుకు వస్తుందని ప్రశ్నించగా.. 2029లో ఇండియా కూటమి ఎన్నికల్లో గెలుస్తుంది అంటూ లోకేశ్ చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లోకేశ్ ఇచ్చిన సమాధానాలకు నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్లు చేస్తున్నారు.
ప్రశ్న: పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఫస్ట్ షో ఏది చూస్తారు?
నారా లోకేశ్: రెండు
ప్రశ్న: హైదరాబాద్ బిర్యానీ, రాగి సంగటి ఏది ఎంచుకుంటారు?
నారా లోకేశ్: రాగి సంగటి
ప్రశ్న: 2029లో ఏం జరుగుతోంది.
నారా లోకేశ్: NDA మళ్లీ విజయం సాధిస్తుంది. pic.twitter.com/kUM2K2lx5g
— ChotaNews App (@ChotaNewsApp) June 30, 2026
