AP DGP: సవాంగ్‌పై వేటు.. ఏపీకి కొత్త డీజీపీ.. ఉత్తర్వులు జారీ
ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పై వేటు పడనున్నట్టు వస్తున్న వార్తలు.. సంచలనం సృష్టిస్తున్నాయి. కాసేపట్లోనే జగన్ ప్రభుత్వం.. కొత్త డీజీపీని నియమించనున్నట్టు తెలుస్తోంది.
- Ravikanth 10tv
- Updated on- February 15, 2022 / 02:39 PM IST
Badilee
AP DGP:ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పై వేటు పడింది. ఇందుకు సంబంధించి వైఎస్ జగన్ ప్రభుత్వం.. కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్త డీజీపీని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ.. సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాల్సిందిగా.. సవాంగ్ ను ప్రభుత్వం ఆదేశించింది.
