AP Minister Twitter Accout : షాకింగ్.. ఏపీ మంత్రి ట్విట్టర్ అకౌంట్లో అశ్లీల చిత్రాలు
- Naveen
- Published on- April 10, 2021 / 03:49 PM IST
Ap Minister Twitter Accout
AP Minister Twitter Account : ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ట్విటర్ అకౌంట్ లో అశ్లీల చిత్రాలు కనిపించడం కలకలం రేపింది. మంత్రి అకౌంట్ లో ఆ చిత్రాలు చూసి అంతా షాక్ అయ్యారు. విషయం తెలిశాక మంత్రి కూడా కంగుతిన్నారు. అసలేం జరిగిందంటే.. మంత్రి గారి అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. హ్యాకర్లు అందులో అశ్లీల చిత్రాలను పోస్ట్ చేశారు. వీటిని ఆలస్యంగా గుర్తించిన మంత్రి వాటిని వెంటనే తొలగించారు. దీనిపై ట్విటర్ సంస్థకు, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, తన ట్విటర్ ఖాతాను ఫాలో అవుతున్న వారందరికీ మంత్రి క్షమాపణలు చెప్పారు.
ఇదే విషయాన్ని ఆయన మరో పోస్ట్ పెట్టి అందరికీ తెలియజేశారు. తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని, అసంబద్ధమైన పోస్టులు పెడుతున్నారని, కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాను అని ట్వీట్ చేశారు. తన ఖాతాలో చెత్త పోస్టులను పట్టించుకోకూడదని న ఫాలోవర్స్ కు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి మేకపాటి. కాగా, తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్న మేకపాటి గౌతమ్ రెడ్డికి.. ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం కాస్త ఇబ్బందికర పరిణామం. ఏకంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ట్విట్టర్ ఖాతా హ్యాక్ కి గురవడం హాట్ టాపిక్ గా మారింది.
