Occult Rituals In School: కర్నూలు జిల్లాలో కలకలం.. బడి ఆవరణంలో క్షుద్ర పూజలు.. భయాందోళనలో విద్యార్థులు

గుర్తుతెలియని దుండగులు పాఠశాల ఆవరణంలో క్షుద్ర పూజలు(Occult Rituals In School) నిర్వహించడం వెలుగులోకి వచ్చింది.

Occult rituals performed at andhra pradesh Erigeri Government High School

  • పాఠశాల ఆవరణంలో క్షుద్ర పూజలు.
  • తీవ్ర భయాందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులలో
  • దుండగులపై కఠిన చర్యలకు డిమాండ్.

Occult Rituals In School: కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఏరిగేరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ఒక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు పాఠశాల ఆవరణంలో క్షుద్ర పూజలు(Occult Rituals In School) నిర్వహించడం వెలుగులోకి వచ్చింది. ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు తిరిగే విద్యా మందిరంలో ఇలాంటి ఘటన జరగడంతో అటు విద్యార్థులు, ఇటు వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వేగంగా వ్యాపించడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

OG Universe: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఓజీ యూనివర్స్’ మొదలయ్యింది.. షూటింగ్ ఎప్పటినుంచి అంటే?

పాఠశాల మైదానంలో దుండగులు మనిషిని పోలిన ఒక బొమ్మను ఉంచి, దాని చుట్టూ పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, పూలు, చిల్లర నాణేలతో పాటు మద్యం సీసాలను కూడా పెట్టి ఈ పూజలు చేశారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులపై చేతబడి చేయడం కోసమే అర్ధరాత్రి వేళ ఈ క్షుద్ర పూజలు నిర్వహించి ఉంటారని స్థానికులు బలంగా అనుమానిస్తున్నారు. ఉదయాన్నే పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఆ దృశ్యాలను చూసి తీవ్ర భయకంపితమయ్యారు.

సాంకేతిక రంగంలో ఎంతో ముందుకు వెళ్తున్న ఈ రోజుల్లో కూడా, చదువుల తల్లి కొలువైన పాఠశాల ప్రాంగణంలో ఇలాంటి మూఢనమ్మకాలతో కూడిన చేతబడులు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భయంతో పిల్లలు బడికి రావడానికే వెనకాడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మరియు పోలీసులు వెంటనే స్పందించి, పాఠశాల ఆవరణంలో క్షుద్ర పూజలు చేసిన దుండగులను త్వరగా గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.