Chandrababu Naidu Birthday : పుట్టిన రోజు వేళ అద్భుతమై పోస్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. ఆమె ఆప్యాయత, సహకారం వల్లే

Chandrababu Naidu Birthday : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బర్త్ డే నేడు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా ఆయన షేర్ చేసిన ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది.

on his birthday occasion AP CM chandrababu cake cutting with his wife

Chandrababu Naidu Birthday : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నేడు. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే బర్త్ డే నాడు ఎక్స్ వేదికగా చంద్రబాబు చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ఆప్యాయత, సహకారం వల్లే తన జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది అంటూ భార్య భువనేశ్వరితో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేశారు చంద్రబాబు.

బర్త్ డే నాడు భార్య భువనేశ్వరితో కలిసి కేక్ కట్ చేసిన ఫోటో పోస్ట్ చేసిన చంద్రబాబు.. ‘‘జీవితంలో మరో సంవత్సరం పూర్తి చేసుకుంటున్న వేళ.. ఎన్నటికీ నాకు అండగా నిలిచే జీవిత భాగస్వామితో కలిసి నా ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటున్నాను. ఆమె సహకారం, ఆప్యాయత వల్లే జీవితం మరింత అర్థవంతంగా మారుతోంది’’ అని పోస్ట్ చేశారు. ఇప్పుడిది తెగ వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే తన పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరితో కలిసి విజయవాడ, పటమటలో అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులిద్దరూ కలిసి స్వయంగా పేదలకు అల్పాహారం వడ్డించి.. వారితో పాటు కూర్చొని భోజనం చేశారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్ల నిర్వహణకు ఒకరోజు ఖర్చుగా రూ.76 లక్షలను భువనేశ్వరి విరాళంగా అందించారు. ఈ విరాళంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో ఆ రోజు ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. అలానే రాష్ట్రంలోని అన్ని అన్న క్యాంటీన్లలో నేడు మూడు పూటలా అన్నదానం నిర్వహించనున్నారు. ఇవాళ్టితో చంద్రబాబు 76వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నారు.