Intermediate Exams: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం పరీక్షా కేంద్రాలు 1,537, హాజరు కావాల్సిన విద్యార్థులు 10,57,312 మంది ఉన్నారు. ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి.
ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదు. మొబైల్, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్లను తీసుకెళ్లడం నిషేధం. ప్రతి గదిలో సీసీటీవీ నిఘా ఉంటుంది. ప్రభుత్వం విద్యార్థుల కోసం అదనపు బస్సులు నడిపేలా చేస్తోంది. పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి.
పరీక్షకు ముందు రోజే విద్యార్థులు హాల్‌టికెట్, అవసరమైన పెన్నులు, ఇతర సామగ్రి సిద్ధం చేసుకోండి. పరీక్ష కేంద్రం ఎక్కడో ముందుగానే తెలుసుకుని సమయానికి చేరేలా ప్లాన్ చేసుకోండి. అర్ధరాత్రి దాటే వరకు చదవకుండా సరిపడ నిద్రపోండి.
తేలికపాటి ఆహారం తీసుకోండి. ప్రశ్నపత్రం పూర్తిగా చదివి సమాధానాలు ప్రారంభించండి. తెలియని ప్రశ్నలపై ఆందోళన చెందకుండా తెలిసినవి ముందుగా రాయండి.