Andhra Pradesh : ఏపీలో దారుణ ఘటన.. కొడుకును గొంతుకోసి హత్యచేసిన తల్లిదండ్రులు!

Andhra Pradesh : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొడుకు వేధింపులు తాళలేక తల్లిదండ్రులు గొంతుకోసి చంపేశారు.

Andhra Pradesh : ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలి నాజరుపేటలో కొడుకు వేధింపులు భరించలేక తల్లిదండ్రులు పీకకోసి హత్య చేశారు. రెండు సెంట్ల భూమిని‌ తన పేరుపై రాయాలని కొడుకు నిత్యం వేధిస్తుండేవాడు. మద్యం మత్తులో నిత్యం గొడవలు చేస్తుండటంతో తట్టుకోలేక పోయిన తల్లిదండ్రులు అతన్ని గొంతుకోసం హత్య చేశారు.

Also Read : Karnataka Doctor Killed : ‘మహాతల్లి..’ భర్తను చంపేసి.. కొడుకుని పొడిచేసి.. పోలీసులు వచ్చేసరికి ఫోన్‌లో రీల్స్ చూస్తుంది..

భాస్కరరావు, విజయమ్మ దంపతులకు కోటేశ్వరరావు, మరియదాసు సంతానం. వారు తెనాలిలోని నాజరుపేటలో నివాసం ఉంటున్నారు. అయితే, భాస్కరరావు దంపతులకు రెండు సెంట్ల భూమి ఉంది. ఈ భూమి విషయంలో పెద్ద కుమారుడు కోటేశ్వరరావు తరచూ వారిపై గొడవపడుతుండేవాడు. మద్యం తాగొచ్చి దుర్భాషలాడేవాడు. పలుసార్లు గ్రామస్థులు సర్దిచెప్పినా వినిపించుకోలేదు.

కోటేశ్వరరావు వేధింపులు రోజురోజుకు పెరుగుతుండటంతో అతని తల్లిదండ్రులు భాస్కరరావు, విజయమ్మలు సహనం కోల్పోయారు. మద్యం తాగొచ్చి గొడవకు దిగిన కొడును పట్టుకొని అతని పీకకోసి చంపేశారు. ఆ తరువాత మృతదేహాన్ని ఆటోలో తరలించే ప్రయత్నం చేయగా.. స్థానికులు అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో తండ్రి భాస్కరరావు, తల్లి విజయమ్మ, తమ్ముడు మరియదాసుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.