Pawan Kalyan: వైకాపా 2.O చూపిస్తే.. మేము 10X చూపిస్తాం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరిక!

వైకాపా 2.O చూపిస్తే ఎన్డీయే 10X చూపిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)హెచ్చరిచ్చారు.

Pawan kalyan and chandrababu naidu warning to ysrcp nda press meet

Pawan Kalyan: వైకాపా తమ 2.O పాలన చూపిస్తామని బెదిరిస్తే, తమ ఎన్డీయే కూటమి ప్రభుత్వం దానికి పదింతలు (10X) ప్రతిస్పందన చూపిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అమరావతిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌లతో కలిసి నిర్వహించిన ఉమ్మడి మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు. వైకాపా 1.O హయాంలో వారు సాగించిన హింసాత్మక రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కొన్న అనుభవం తమకు ఉందని, ఆ తరహా భయానక వాతావరణాన్ని తట్టుకుని ప్రజలకు ఏ విధంగా అండగా నిలబడాలో తమకు బాగా తెలుసని స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండే రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు పద్ధతిగా వ్యవహరించాలని, ప్రతిదానికీ హెచ్చరికలు జారీ చేయడం సరికాదని హితవు పలికారు.

Election Commission Of India: 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు.. నవంబర్ 30 డెడ్‌లైన్.. కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ఆదేశాలు

వైకాపా నేతల తీరుతో సమాజానికి నష్టం.. సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం:

ఇదే మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, వైకాపా నేతల బాధ్యతారాహిత్య వైఖరి, హింసాత్మక రాజకీయ ధోరణి వల్ల రాష్ట్ర సమాజం తీవ్రంగా నష్టపోతోందని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి సాగించిన విధ్వంసకర పాలనను ప్రజలు ఇంకా మరచిపోలేదని, ఇప్పుడు మళ్లీ బెదిరింపులకు దిగితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అభివృద్ధి, ప్రజాక్షేమమే ధ్యేయంగా ఎన్డీయే కూటమి పాలన సాగుతోందని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో పారదర్శకమైన పాలన అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని చంద్రబాబు పునరుద్ఘాటించారు.