Anil Kumar : పవర్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ : అనిల్ కుమార్
ఒక ఊరిలో ఇద్దరు బాగుండాలి అంటే చంద్రబాబు కావాలి ఊరు మొత్తం బాగు పడాలి అంటే సీఎం జగన్ రావాలి అని అన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తామని చంద్రబాబు బెదిరించారని పేర్కొన్నారు.
- bheemraj
- Published On : November 18, 2023 / 06:45 PM IST
Anil Kumar Yadav
Anil Kumar – Pawan Kalyan : సీఎం జగన్ సగానికి పైగా పదవులను బడుగు బలహీనర్గాలకు ఇచ్చారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. యాదవులకు సీఎం జగన్ పదవులు ఇస్తే గొడ్లు కాసుకునే వారికి పదవులు ఇచ్చారని హేళన చేశారని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు కూడా గొడ్లను కాసుకున్నారని తెలిపారు. ఒక ఊరిలో ఇద్దరు బాగుండాలి అంటే చంద్రబాబు కావాలి ఊరు మొత్తం బాగు పడాలి అంటే సీఎం జగన్ రావాలి అని అన్నారు.
శనివారం విశాఖ తూర్పు నియోజకవర్గంలో సామాజిక సాధికార సభలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. బీసీల తోకలు కత్తిరిస్తామని చంద్రబాబు బెదిరించారని పేర్కొన్నారు. పార్టీ పెట్టి సీఎం కాకూడదని అనుకున్న వ్యక్తి పవన్ అని అన్నారు. చంద్రబాబు సీఎం కావాలని కోరుకునే వ్యక్తి పవన్ అని పేర్కొన్నారు.
Amit Shah : బీజేపీ అధికారంలోకొస్తే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తాం : అమిత్ షా
పవర్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలు, మోసాలకు ప్రజలు మోసపోవద్దని సూచించారు. లోకేష్ ఒక పులకేశి అని ఎద్దేవా చేశారు. తండ్రి జైలులో ఉంటే ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్ అని విమర్శించారు. సీఎం జగన్ దమ్ము నాయకుడని పేర్కొన్నారు.
