పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ లో ఆంతర్యమేంటి? మీడియాకు దూరంగా జనసేనాని

పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన అంతా సీక్రెట్‌గా సాగుతోంది. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌లో విస్త్రృత స్థాయి సమావేశం జరుగుతుండగా హస్తిన వెళ్లిన పవన్.. అక్కడికెళ్లాక అజ్ఞాతవాసిగా మారాడు.

  • Publish Date - January 12, 2020 / 05:25 AM IST

పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన అంతా సీక్రెట్‌గా సాగుతోంది. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌లో విస్త్రృత స్థాయి సమావేశం జరుగుతుండగా హస్తిన వెళ్లిన పవన్.. అక్కడికెళ్లాక అజ్ఞాతవాసిగా మారాడు.

జనసేనాని హస్తిన పర్యటనలో ఆంతర్యమేంటి? పార్టీ విస్తృతస్థాయి సమావేశం నుంచి అంత అర్జెంటుగా వెళ్లడానికి కారణమేంటి? నిన్న ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్ అక్కడ ఏం చేస్తున్నారు? ఎవరిని కలవబోతున్నారు? ఇవే ఇపుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ ప్రశ్నలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆందోళనలు జరుగుతున్న సమయంలో.. అమరావతికి అనుకూలంగా కార్యాచరణ చేపట్టాలని బీజేపీ నిర్ణయించుకున్న టైమ్‌లో… జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశమైంది.

పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన అంతా సీక్రెట్‌గా సాగుతోంది. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్‌లో విస్త్రృత స్థాయి సమావేశం జరుగుతుండగా హస్తిన వెళ్లిన పవన్.. అక్కడికెళ్లాక అజ్ఞాతవాసిగా మారాడు. నిన్నటినుంచి ఆయన ఎవరికీ చిక్కడంలేదు. ఎక్కడ ఉన్నారన్నదానిపైనా సమాచారంలేదు. ఎవరిని కలుస్తారనే దానిపై అధికారిక సమాచారంలేదు. అసలు… ఆయనను ఢిల్లీకి ఎవరు పిలిచారన్నది కూడా తెలియడంలేదు. మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు. అయితే… ఆయన రాజకీయ కారణాలతో ఢిల్లీకి వెళ్లారా.. లేదంటే… వ్యక్తిగత అంశాలపై వెళ్లారా అన్నది సస్పెన్స్‌గామారింది. 

ఢిల్లీలో ఉన్న పవన్‌… . నిన్ననే బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డాను కలుస్తారని వార్తలు వచ్చాయి. కానీ.. వారిద్దరి భేటీ ఇంతవరకు జరగలేదు. అయితే… ఆయన ఇవాళ జేపీ నడ్డాను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. పలువురు బీజేపీ పెద్దలను కూడా కలవనున్నట్లు సమాచారం. బీజేపీతో పొత్తు, అమరావతి విషయంలో కేంద్రం జోక్యంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ దీనిపై అధికారిక సమాచారం లేకపోవడంతో పవన్‌ పర్యటన వెనక మతలబు ఏంటన్నది ఆసక్తిరేపుతోంది

అమరావతి విషయంలో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని ఇటీవల పవన్‌ ప్రకటించిన నేపథ్యంలో… ఆయనను బీజేపీ పెద్దలే పిలిచారన్న టాక్ వినిపిస్తోంది.  ఇప్పటికే పవన్ రెండుసార్లు ఢిల్లీ వెళ్లివచ్చిన పవన్‌… ఇప్పుడు మూడోసారి కూడా వెళ్లడంతో… రాజకీయంగా ఢిల్లీ పెద్దలు పావులు కదుపుతున్నారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అమరావతి రైతుల పట్ల అనుకూలంగా ఉన్న పవన్‌ను కలుపుకొని… బీజేపీ తన కార్యాచరణ సాగిస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదే నిజమైతే….జనసేనాని ఢిల్లీ నుంచి వచ్చాక తన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసి ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది