Pawan Kalyan Health : పవన్ కల్యాణ్‌కు ముంబయిలో వైద్య పరీక్షలు.. అసలు ప్రాబ్లం ఇదే.. బండ్ల గణేశ్ ఎమోషనల్ పోస్ట్..

Pawan Kalyan Health : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోమవారం ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

Pawan Kalyan medical tests Kokilaben Dhirubhai Ambani Hospital at Mumbai

  • పవన్ కల్యాణ్‌కు ముంబయిలో వైద్య పరీక్షలు
  • శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచన
  • సినీ నిర్మాత బండ్ల గణేష్ ఎమోషన్ ట్వీట్

Pawan Kalyan Health : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోమవారం ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ఆస్పత్రికి వెళ్లిన పవన్‌కు అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Also Read : Gold Silver Rate Today : దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. ఏపీ, తెలంగాణలో రేట్లు ఇవే..

పవన్ కల్యాణ్ కొంత కాలంగా రొటేటర్ కఫ్‌, రెండు భుజాల కండరాల గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. భుజాల కండరాలు చిట్లడంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. పవన్ ఎదుర్కొంటున్న సమస్యను పరీక్షించిన వైద్యులు.. రొటేటర్ కఫ్ తో పాటు భుజాల కండరాలు తీవ్రంగా గాయపడినట్లు నిర్ధారించారు. వెంటనే శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు పవన్ కల్యాన్‌కు సూచించారు. అయితే, ముందుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలు, పాలనాపరమైన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తరువాత శస్త్ర చికిత్స చేయించుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఇదిలాఉంటే.. పవన్ కల్యాణ్ వైద్య పరీక్షల వేళ సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఆసక్తికర పోస్టు చేశారు.

బండ్ల గణేష్ ట్వీట్ ప్రకారం.. 
‘ఒక సంవత్సరం కాదు.. రెండు సంవత్సరాలు కాదు.. దాదాపు పదిహేనేళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మనిషి విలవిల్లాడిపోతాడు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణం. నాకు ఈ రోజుకూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్లముందే కనిపిస్తున్నాయి. గుజరాత్‌లో జరిగిన ఆ ప్రమాదం.. గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం.. వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం.. ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు. మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం.’’

“ముందు సినిమా పూర్తి చేద్దాం… నిర్మాతకు ఇబ్బంది కలగకూడదు… ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు…” అని మీ శరీరం భరించలేని నొప్పిని గుండెల్లో దాచుకుని, ఆపరేషన్‌ను వాయిదా వేసి, షూటింగ్ పూర్తి చేసి, సినిమా విడుదలయ్యే వరకు మాకు అండగా నిలిచారు. ఒక నిర్మాతగా ఆ రోజున మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ సినిమా మాత్రమే కాదు. జీవితాంతం మర్చిపోలేని ఋణం. ఆ ఋణాన్ని నేను ఏ జన్మలోనూ తీర్చలేనని బండ్ల గణేశ్ పేర్కొన్నారు.

దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నాను. మీరు అనుభవించిన ప్రతి నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు తెరపై మాత్రమే కాదు.. నిజ జీవితంలో కూడా ఎందరో మనుషుల జీవితాలను నిలబెట్టిన నిజమైన హీరో. మీరు ఆరోగ్యంగా నవ్వుతూ ఉండటమే… మీపై ప్రేమ ఉన్న మా అందరికీ అతిపెద్ద సంతోషం అంటూ బండ్ల గణేష్ ట్వీట్ లో పేర్కొన్నారు.