చూస్తూ ఊరుకోము : రాజధానిపై బీజేపీ-జనసేన కీలక నిర్ణయం

రాజధానిపై కలిసి పోరాడాలని బీజేపీ-జనసేన నిర్ణయం తీసుకున్నాయి. రాజధాని ఏకపక్షంగా తరలిస్తామంటే చూస్తూ ఊరుకోము అని జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని

  • Publish Date - January 16, 2020 / 10:34 AM IST

రాజధానిపై కలిసి పోరాడాలని బీజేపీ-జనసేన నిర్ణయం తీసుకున్నాయి. రాజధాని ఏకపక్షంగా తరలిస్తామంటే చూస్తూ ఊరుకోము అని జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని

రాజధాని విషయంలో బీజేపీ-జనసేన కీలక నిర్ణయం తీసుకున్నాయి. అమరావతి రాజధానిగా కొనసాగాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. రైతుల ఆందోళనకు అండగా ఉండాలని డిసైడ్ అయ్యాయి. రాజధానిపై కలిసి పోరాడాలని బీజేపీ-జనసేన నిర్ణయించాయి. రాజధాని ఏకపక్షంగా తరలిస్తామంటే చూస్తూ ఊరుకోము అని జనసేనాని పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రతిపక్ష నేతగా జగన్ అమరావతి రాజధానిని సమర్ధించారని పవన్ గుర్తు చేశారు. రాజధాని విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే అది జగన్ భ్రమే అవుతుందన్నారు. రాజధాని విషయంలో వీధుల్లో పోరాడతామని, అవసరమైతే చట్టపరంగా పోరాడతామని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. పొత్తుపై ఇవాళ(జనవరి 16,2020) విజయవాడలో జరిగిన చర్చల్లో బీజేపీ-జనసేన కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఏపీలో కలిసి పని చేయాలని బీజేపీ-జనసేన నిర్ణయించాయి.

ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. కొత్త బంధం మొదలైంది. ఇకపై రాష్ట్రంలో కలిసి పని చేయాలని బీజేపీ-జనసేన నిర్ణయించాయి. ఏపీలో అధికారమే లక్ష్యంగా బీజేపీ-జనసేన పని చేస్తాయని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం(జనవరి 16,2020) విజయవాడలో బీజేపీ-జనసేన కీలక నేతల మధ్య సుదీర్ఘ సమావేశం(మూడున్నర గంటలు) జరిగింది. ఈ సమావేశంలో ఇరు పార్టీల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రంలోని పరిణామాలపై సమావేశంలో చర్చించామని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

ఏపీ భవిష్యత్తు కోసం బీజేపీతో కలిసి ముందుకెళ్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉందన్నారు. జనసేన-బీజేపీ భావజాలం ఒక్కటే అన్నారు పవన్. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటా చేస్తామని తెలిపారు. బేషరుతుగా బీజేపీతో కలిసి వెళ్తున్నామని వివరించారు. రాజధాని రైతులను నిండా ముంచారని జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు పవన్. 5కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఇరు పార్టీల మధ్య అవగాహన కోసం కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామని పవన్ వెల్లడించారు.

2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతామన్నారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం వల్ల ఏపీకి లాభం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. 2024లో ఏపీలో బీజేపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని పవన్ నమ్మకం వ్యక్తం చేశారు.

* ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టానికి అంకురార్పణ
* కలిసి పని చేయాలని బీజేపీ-జనసేన నిర్ణయం
* విలీనానికి నో చెప్పిన పవన్.. బీజేపీతో పొత్తులే అని ప్రకటన
* పలు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చిన రెండు పార్టీలు
* బీజేపీతో కలిసి పని చేయడానికి పవన్ ముందుకొచ్చారు-కన్నా
* అధికారమే లక్ష్యంగా కలిసి పని చేస్తాం-కన్నా
* బేషరతుగా బీజేపీతో కలిసి పని చేయడానికి పవన్ ముందుకొచ్చారు-కన్నా

* బీజేపీ-జనసేన కలయిక చరిత్రాత్మకం-కన్నా
* ఏపీలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న పార్టీలపై పోటీ చేస్తాం-కన్నా
* ప్రజా సమస్యలపై కలిసి పోరాడతాం-కన్నా
* దేశ, రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీతో కలిసి పని చేసేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నారు
* ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని పాతాళానికి తొక్కేస్తున్నారు-కన్నా
* జనసేనతో కలిసి పని చేయడాన్ని స్వాగతిస్తున్నాం-కన్నా
* రాష్ట్రాభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నాం-నాదెండ్ల

పవన్ కామెంట్స్:
* ఏపీ భవిష్యత్తు కోసం బీజేపీతో కలిసి ముందుకెళ్తాం
* కేంద్రంలో బలమైన ప్రభుత్వం వల్ల ఏపీకి లాభం
* జనసేన, బీజేపీ భావజాలం ఒక్కటే
* స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం
* బేషరుతుగా బీజేపీతో కలిసి వెళ్తున్నాం
* సీఎం జగన్ రాజధాని రైతులను నిండా ముంచారు
* రెండు పార్టీల మధ్య అవగాహన కోసం కో-ఆర్డినేషన్ కమిటీ
* స్థానిక సంస్థల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం
* ఏపీకి బీజేపీ అవసరం చాలా ఉంది
* 2024లో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
* కేంద్రంలో బలమైన ప్రభుత్వం వల్ల ఏపీకి లాభం

రాజధానిపై కన్నా కామెంట్స్:
* రాజధానిపై జగన్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు
* జగన్ ఇష్టమొచ్చినట్టు నిర్ణయం తీసుకుంటే చూస్తూ ఊరుకోము
* అసెంబ్లీలో మెజార్టీ ఉందని.. ఏదనుకుంటే అది చేస్తామంటే కుదరదు
* రాజధాని విషయంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే అది జగన్ భ్రమే అవుతుంది
* రాజధాని విషయంలో వీధుల్లో పోరాడతాం.. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం
* 2024లో జనసేన-బీజేపీ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుంది
* అభివృద్ధి వికేంద్రీకరణకు బీజేపీ కట్టుబడి ఉంది
* మేము అధికారంలోకి వస్తే రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తాం
* నియంతృత్వ ధోరణి ప్రజాస్వామ్యంలో చెల్లదు
 

Also Read : 2024లో అధికారం మాదే : రాష్ట్ర భవిష్యత్తు కోసమే బీజేపీతో కలిశా