తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపలకు క్యూ లైన్లు వచ్చాయి.

తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ

TTD

Updated On : August 15, 2025 / 1:47 PM IST

తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ అనుహ్యంగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు బారులు తీరారు. ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం.. ఇలా వరుస సెలవులు నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి ఆక్టోపస్ భవనం వరకు క్యూ లైన్లు ఉన్నాయి.

Also Read: దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్‌ సాధించిన మైలురాళ్లు ఇవే.. ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండేలా..

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపలకు క్యూ లైన్లు వచ్చాయి. మరోవైపు, నిన్న శ్రీవారిని 66,530 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.66 కోట్లు.