×
Ad

Kodali Nani: మాజీమంత్రి కొడాలి నాని అనుచరుడు అరెస్ట్.. ఎందుకంటే..

బాధితుడు వెంకటరామయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Kodali Nani: వైసీపీ కీలక నేత, మాజీమంత్రి కొడాలి నాని అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొడాలి నాని అనుచరుడు గంటా శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. గంటా శ్రీనివాసరావు నకిలీ పోలీస్ అవతారమెత్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నేను ఎస్ఐ అంటూ.. గుడివాడ మండలం మోటూరులో పుజారిని బెదిరించాడు. ఆలయ తాళాలు లాక్కున్ని ఆలయంలో వాటర్ బోర్, మోటర్ తీసుకెళ్లాడు కొడాలి నాని అనుచరుడు గంటా శ్రీనివాసరావు. బాధితుడు వెంకటరామయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నాని అనుచరుడిని అరెస్ట్ చేశారు. గంటా శ్రీనివాసరావు గుడివాడ నియోజకవర్గ వైసీపీ ప్రచార విభాగ అధ్యక్షుడిగా ఉన్నాడు.

Also Read: ఏపీలో కొత్త జిల్లాలు.. మంత్రివర్గ ఉపసంఘం కీలక భేటీ..