Ambati Rambabu: అర్థరాత్రి బయటకు తీసుకొచ్చి.. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు- జడ్జికి తెలిపిన అంబటి రాంబాబు
తాను ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆయన వాపోయారు.
- Naveen
- Published On : February 1, 2026 / 11:18 PM IST
Ambati Rambabu: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంబటి రాంబాబు రిమాండ్ కు సంబంధించి వాదనలు ముగిశాయి. ఈ సందర్భంగా గుంటూరు జడ్జి ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు అంబటి. తాను ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆయన వాపోయారు. పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. అర్థరాత్రి వేళ పోలీసులు తనను సెల్ లో నుంచి బయటకు తీసుకొచ్చారని చెప్పారు. పోలీసులు తనను వేధించారని ఆయన ఆరోపించారు. తనపై దాడి చేశారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు.
