ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వాయవ్య దిశగా పయనిస్తు వాయుగుండంగా బలపడనుంది అల్పపీడనం. 27వ తేదీ నాటికి తుపానుగా బలపడి 28వ తేదీలోపు చెన్నై, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో 24వ తేదీ నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 26 తర్వాత దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 27, 28 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. అన్నదాతలు వ్యవసాయ పనుల్లో ఈ మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
పెరుగుతున్న చలి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అలాగే, ఉదయం 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో పొగ మంచు కమ్ముకుంటోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి.
Gold Rates: దేశంలో మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు