ఎస్సీ, ఎస్టీలకు ఫ్రీ, బీసీలకు రాయితీ.. ఏపీలో సూర్యఘర్ యోజన పథకానికి అప్లై చేసుకోండిలా.. స్టెప్ బై స్టెప్

కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల వరకు రాయితీ ఇస్తుంది. అదే సమయంలో 2 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అందుకు రూ.60వేలు రాయితీ ఇస్తుంది. కేవలం ఒక కిలోవాట్ అయితే రూ.30వేలు కేంద్రం భరిస్తుంది.

ఎస్సీ, ఎస్టీలకు ఫ్రీ, బీసీలకు రాయితీ.. ఏపీలో సూర్యఘర్ యోజన పథకానికి అప్లై చేసుకోండిలా.. స్టెప్ బై స్టెప్

Updated On : December 14, 2025 / 5:32 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సూర్యఘర్ యోజన పథకానికి సంబంధించి ఏపీ విద్యుత్ శాఖ మంత్రి సంచలన ప్రకటన చేశారు. ఏపీలో దళితులు, గిరిజనులకు ఈ పథకాన్ని పూర్తి ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే, వెనుకబడిన వర్గాలకు రాయితీ మీద ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. దేశవ్యాప్తంగా కోటి మందికి ఈ సూర్యఘర్ యోజన పథకాన్ని అమలు చేయాలని కేంద్రం సంకల్పించింది. దీని ద్వారా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చు.

మీ ఇంటి మీద సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే అందుకు ఈ పథకం బెస్ట్. ఈ స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. ఉదాహరణకు మీరు 3 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ను మీ ఇంటి పైన ఏర్పాటు చేసుకోవాలనుకుంటే సుమారు 1.50 లక్షలు అవుతుందనుకుందాం. అందులో కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల వరకు రాయితీ ఇస్తుంది. అదే సమయంలో 2 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అందుకు రూ.60వేలు రాయితీ ఇస్తుంది. కేవలం ఒక కిలోవాట్ అయితే రూ.30వేలు కేంద్రం భరిస్తుంది.

తాజాగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఈ పథకం ఎస్సీ, ఎస్టీలకు పూర్తిగా ఉచితం. బీసీలకు రాయితీ ఇస్తుంది. దీనికి దరఖాస్తు చేసుకోవడం ఎలాగో చూద్దాం.

మొదట pmsuryaghar.gov.in వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి

ఆ తర్వాత ప్రస్తుతం మీ కరెంట్ మీటర్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి

లాగిన్ అయిన తర్వాత అప్లై చేసుకోవాలి

మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత అధికారులు వాటిని చెక్ చేసి అనుమతులు ఇస్తారు

వెబ్ సైట్ లో కొన్ని కంపెనీలను ప్రభుత్వం సూచిస్తుంది. ఆ కంపెనీల వద్ద సోలార్ రూఫ్ టాప్ కొని ఇన్ స్టాల్ చేయాలి

ఇన్ స్టాలేషన్ పూర్తయ్యాక వివరాలు మళ్లీ పోర్టల్లో అప్ డేట్ చేయాలి

మీకుమళ్లీ కొత్త మీటర్ వస్తుంది. అది డిస్కం అధికారులు చెక్ చేసి సర్టిఫికెట్ ఇస్తారు

ఇదతా అయ్యాక మీకు క్యాన్సిల్ చెక్ తీసుకుని మళ్లీ పోర్టల్లో మీ డిటెయిల్స్ అన్నీ అప్ డేట్ చేస్తే నెల రోజుల్లో మీ అకౌంట్ లో రాయితీ డబ్బులు పడతాయి.

దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీకు దగ్గరలో ఉన్న సచివాలయంలో కనుక్కోవచ్చు.