Natti Kumar : రామ్ గోపాల్ వర్మ నాకు పేమెంట్స్ ఇవ్వాలి.. అవి ఇవ్వకుండా వ్యూహం సినిమా రిలీజ్ చేయలేడు : నట్టి కుమార్

తన వల్ల 3 ఓట్లు రావని విజయసాయి రెడ్డి అన్నాడు అది నిజమే కానీ, తన వల్ల ఆ మూడు ఓట్లు కూడా పోవని, పోసాని వల్ల పోతాయని చెప్పారు.

Natti Kumar : రామ్ గోపాల్ వర్మ నాకు పేమెంట్స్ ఇవ్వాలి.. అవి ఇవ్వకుండా వ్యూహం సినిమా రిలీజ్ చేయలేడు : నట్టి కుమార్

Producer Natti Kumar

Natti Kumar – Ram Gopal Varma : ‘నాకు రామ్ గోపాల్ వర్మ పేమెంట్స్ ఇవ్వాలి.. అవి ఇవ్వకుండా వ్యూహం సినిమా రిలీజ్ చేయలేడు’ అని నిర్మాత నట్టి కుమార్ పేర్కొన్నారు. తన డబ్బులు వచ్చే దాక వ్యూహం సినిమాను అడ్డుకుంటానని తెలిపారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్తామని చెప్పారు.

తన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయని పోలీసులు అడిగారు.. అన్ని చెప్పానని తెలిపారు. తాను టీడీపీకి సపోర్ట్ చేశానని ఇప్పుడు కేసులు గుర్తుకు వచ్చాయా అని అడిగారు. అగ్రిమెంట్స్ ఉన్నాయని, జగన్ మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వొద్దని చెప్పారని పేర్కొన్నారు.

Ram Pothineni : స్కంద సినిమాలో రామ్‌కి డూప్‌గా నటించిన బోయపాటి.. ట్రోల్స్‌కి సమాధానం ఇచ్చిన రామ్..

తాను గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ లో ఉన్నానని వైస్సార్సీపీకి దూరంగా ఉన్నానని వెల్లడించారు. తన వల్ల 3 ఓట్లు రావని విజయసాయి రెడ్డి అన్నాడు అది నిజమే కానీ, తన వల్ల ఆ మూడు ఓట్లు కూడా పోవని, పోసాని వల్ల పోతాయని చెప్పారు. తాను చంద్రబాబును అరెస్టు చేయడాన్ని ఖండిచానని తెలిపారు.