Ram Pothineni : స్కంద సినిమాలో రామ్‌కి డూప్‌గా నటించిన బోయపాటి.. ట్రోల్స్‌కి సమాధానం ఇచ్చిన రామ్..
ఓటీటీలో స్కంద సినిమాని చూసిన వాళ్ళు సినిమాలో క్లైమాక్స్ ఫైట్ లో ఒక షాట్ లో రామ్ కి బదులు డైరెక్టర్ బోయపాటి చేసినట్టు కనిపెట్టారు.

Trolls on Boyapati Sreenu Skanda Movie Ram Pothineni Replied
Ram Pothineni : బోయపాటి(Boyapati) దర్శకత్వంలో రామ్ ఊర మాస్ గా మారి వచ్చిన సినిమా స్కంద(Skanda). శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్స్ గా, శ్రీకాంత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 28న థియేటర్స్ లో రిలీజయి పర్వాలేదనిపించింది. ఫుల్ మాస్, యాక్షన్ తో ఉండటంతో సినిమా కేవలం మాస్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చింది. తాజాగా స్కంద సినిమా నవంబర్ 2 నుంచి డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలోకి వచ్చింది.
అయితే ఓటీటీలో ఈ సినిమాని చూసిన వాళ్ళు సినిమాలో క్లైమాక్స్ ఫైట్ లో ఒక షాట్ లో రామ్ కి బదులు డైరెక్టర్ బోయపాటి చేసినట్టు కనిపెట్టారు. సినిమాలో బోయపాటి ఉన్న షాట్ ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో పలువురు దీనిపై ట్రోల్స్, మీమ్స్ వేశారు. ఎడిటింగ్ లో చూసుకోలేదా, రామ్ కి డూప్ గా నటించారా? మేకింగ్ వీడియోని ఇందులో కలిపారా అని ప్రశ్నిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా బోయపాటిపై వస్తున్న ట్రోల్స్ కి రామ్ గట్టిగానే స్పందించాడు.
Also Read : Karthi : బిగ్‌బాస్‌లో కార్తీ సందడి.. నాగార్జునతో కలిసి.. జపాన్ ప్రమోషన్స్..
ఓ మీడియా సంస్థ బోయపాటి షాట్ ని పోస్ట్ చేయగా దానికి సమాధానంగా రామ్.. 2023 సమ్మర్ ఏప్రిల్ 22న ఆ షూటింగ్ జరిగింది. ఫుల్ సమ్మర్ లో జరిగిన షూట్ నాకింకా గుర్తు ఉంది. ఎండలో చెప్పులు లేకుండా ఫైట్ చేసే సీన్ అది. అప్పటికే మూడు రోజులు కష్టపడ్డాను. సరిగ్గా నడవలేకపోయాను కూడా. రక్తం రావడంతో కాసేపు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాను. మా డైరెక్టర్ అంతలో ఆ షూట్ తానే నటించి పూర్తి చేశారు. సినిమా నచ్చడం, నచ్చకపోవడం అనేది పూర్తిగా ఆడియన్స్ ఇష్టం. నేను మీ అభిప్రాయాలకు రెస్పెక్ట్ ఇస్తాను. ఇదంతా నేను మీ కోసమే చేస్తున్నాను. ఆ ఒక్క షాట్ మా డైరెక్టర్ నా కోసం చేశారు. నేను మాత్రం మిమ్మల్ని అలరించడానికి నా రక్తం, చెమటను ధారపోస్తాను అని ట్వీట్ చేస్తూ తన అరికాలికి అయిన గాయాలు చూపిస్తూ ఓ ఫోటోని షేర్ చేశాడు. దీంతో రామ్ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
22.04.23 I still remember..it was one of the hottest days during the peak of summer..this was my feet after filming this episode on the 3rd day of the 25days..couldn’t walk properly..went away for a bit after it started to bleed..so My Director wanted to get the shot right n did… https://t.co/8cSOTW2H7b pic.twitter.com/4DXF0DYDFn
— RAm POthineni (@ramsayz) November 4, 2023