Karthi : బిగ్‌బాస్‌లో కార్తీ సందడి.. నాగార్జునతో కలిసి.. జపాన్ ప్రమోషన్స్..
తమిళ్ స్టార్ హీరో కార్తీ బిగ్‌బాస్ కి వచ్చి సందడి చేశారు. తాను నటించిన జపాన్ సినిమా దీపావళికి తెలుగు, తమిళ్ లో రిలీజ్ కానుంది.

Bigg Boss 7 Karthi Special Entry for Japan Movie Promotions
Karthi : బిగ్‌బాస్(Bigg Boss) తెలుగు సీజన్ ఇప్పటికే 8 వారాలు పూర్తయి తొమ్మిదో వారం సాగుతుంది. నేడు శనివారం వీకెండ్ ఎపిసోడ్ అని తెలిసిందే. శనివారం వీకెండ్ ఎపిసోడ్ లో సాధారణంగా వారం అంతా కంటెస్టెంట్స్ చేసిన తప్పులను నాగార్జున ఎత్తి చూపిస్తారు. ఆదివారం వీకెండ్ ఎపిసోడ్ కి అప్పుడప్పుడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గెస్టులని తీసుకొస్తారు. అయితే ఈ సారి శనివారం ఎపిసోడ్ లోనే స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చారు నాగార్జున.
తమిళ్ స్టార్ హీరో కార్తీ బిగ్‌బాస్ కి వచ్చి సందడి చేశారు. తాను నటించిన జపాన్ సినిమా దీపావళికి తెలుగు, తమిళ్ లో రిలీజ్ కానుంది. తెలుగులో కూడా కార్తీకి మంచి మార్కెట్ ఉండటంతో ఇక్కడ కూడా జపాన్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే కార్తీ బిగ్‌బాస్ లో పాల్గొన్నారు.
Also Read : Bigg Boss 7 : ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతడేనా..?
జపాన్ లో కార్తీ డార్క్ క్యారెక్టర్ చేస్తున్నాడని చెప్పడంతో హౌస్ లోని కంటెస్టెంట్స్ డార్క్ క్యారెక్టర్స్ రివీల్ చేశారు నాగార్జున. సరదాగా కాసేపు హౌస్ కంటెస్టెంట్స్ తో కార్తీ, నాగార్జున ఆడుకున్నారు. ఇక జపాన్ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగులో రిలీజ్ చేస్తుంది. గతంలో కార్తీ, నాగార్జున కలిసి ఊపిరి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.