Tirumala Bike Taxi Ban : తిరుమల వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. కొండపై కొత్త రూల్స్.. ర్యాపిడో, ఓలా, ఉబర్ బైక్ రైడ్స్‌పై నిషేధం

Tirumala Bike Taxi Ban : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది.

Tirumala Bike Taxi Ban

Tirumala Bike Taxi Ban : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాపిడో, ఓలా, ఉబర్ వంటి యాప్‌ల ద్వారా బుక్ చేసుకునే బైక్ రైడ్స్‌ను తిరుమలకు అనుమతించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద బైక్ రైడ్స్‌కు అనుమతి లేదంటూ పోస్టర్లు ఏర్పాటు చేసింది. కొండపైకి వెళ్లాలని భావించే భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ యాప్ ఆధారిత బైక్ ట్యాక్సీలను బుక్ చేసుకోవద్దని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.

Also Read : Global Horticulture Hub : ఒకే వేదికపై చంద్రబాబు, పవన్, లోకేశ్, అనంత్ అంబానీ.. నవ్వులు చిందిస్తూ.. ఆప్యాయంగా పలుకరించుకుంటూ.. ఫొటోల వైరల్..

టీటీడీ నిర్ణయం వెనుక ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం ప్రధాన కారణంగా తెలుస్తోంది. సెప్టెంబర్ 26న హైదరాబాద్‌కు చెందిన సునీల్ తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి విమానాశ్రయానికి వెళ్లేందుకు రాపిడో బైక్‌ను బుక్ చేసుకున్నారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 26వ మలుపు వద్ద బైక్ అదుపు తప్పి రక్షణ రైలింగ్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాపిడో బైకర్ అక్కడికక్కడే మృతి చెందగా.. సునీల్ తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన టీటీడీ.. తిరుమల ఘాట్ రోడ్లపై యాప్ ఆధారిత బైక్ రైడ్స్‌కు అనుమతి లేకుండా చర్యలు చేపట్టింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ప్రత్యేకంగా ‘Not Allowed’ పోస్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు.. యాప్‌ల ద్వారా తిరుమలకు వచ్చే బైక్‌లపై నిఘా ఉంచాలని విజిలెన్స్ సిబ్బందిని అధికారులు ఆదేశించినట్లు తెలిసింది. అంతేకాకుండా రాపిడో, ఓలా, ఉబర్ వంటి యాప్‌లలో తిరుమలను రైడ్ డెస్టినేషన్‌గా ఎంచుకునే అవకాశం లేకుండా చేయాలని ఆయా సంస్థలను కోరే ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు సమాచారం. అంటే, యాప్‌లో తిరుమల రైడ్ ఆప్షన్‌నే తొలగించే దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.