Sai Roop: ఎవరు అడ్డుకున్నా తగ్గేది లే.. 18న ప్రెస్ మీట్ పెట్టి తీరుతాం.. వైసీపీ సపోర్ట్ ఉందా? క్లారిటీ ఇచ్చిన రా ఎన్టీఆర్ రూప్!
జూనియర్ ఎన్టీఆర్ పేరుతో నడుస్తున్న ‘రా ఎన్టీఆర్’ సేవా సంస్థ చుట్టూ జరుగుతున్న ప్రచారంపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు సాయి రూప్(Sai Roop) స్పందించారు.
Raw NTR founder Sai Roop sensational comments regarding Tirupati meeting on july 18th
- రా ఎన్టీఆర్ ప్రెస్ మీట్
- రాజకీయాలతో సంబంధం లేదని వెల్లడి
- వంద కోట్లపై పూర్తి స్పష్టత
Sai Roop: జూనియర్ ఎన్టీఆర్ పేరుతో నడుస్తున్న ‘రా ఎన్టీఆర్’ (RAW NTR) సేవా సంస్థ చుట్టూ జరుగుతున్న ప్రచారంపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు సాయి రూప్(Sai Roop) స్పందించారు. ఈ నెల 18వ తేదీన తిరుపతిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రెస్ మీట్ నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఎవరు అడ్డుకున్నా, ఆపాలని చూసినా వెనక్కి తగ్గేదే లేదని ఆయన తేల్చి చెప్పారు. తమ ప్రెస్ మీట్‌కు ఎలాంటి రాజకీయాలతో సంబంధం లేదని, ఇది కేవలం హీరో ఎన్టీఆర్ కోసం స్థాపించిన ఒక ఎన్జీవో (NGO) సంస్థ మాత్రమేనని సాయి రూప్ వెల్లడించారు.
అలాగే, తమ వెనుక వైసిపి హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణలను ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, ‘రా ఎన్టీఆర్’ పేరిట ఎలాంటి వసూళ్లకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ పక్కన ఉండే కొందరు వ్యక్తులే ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన రూ.100 కోట్ల వ్యవహారంపై ప్రెస్ మీట్లోనే మరిన్ని ఆధారాలతో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కాగా, ఈ ప్రెస్ మీట్‌కు అభిమానులు ఎవరూ రావద్దని సాయి రూప్ విజ్ఞప్తి చేశారు.
