Thalliki Vandanam: తల్లికి వందనం రూ.13000పై వచ్చేది అప్పుడే.. డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. వచ్చేది వీళ్లకే..
‘తల్లికి వందనం’ పథకం(Thalliki Vandanam Scheme) ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
Chandrababu government has issued orders launching 'Thalliki Vandanam' scheme from July 22.
- తల్లికి వందనం ఉత్తర్వులు జారీ
- తల్లుల ఖాతాల్లో సొమ్ము జమ
- ఒకటో తరగతి నుండి ఇంటర్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ‘తల్లికి వందనం’ పథకం అమలుపై కూటమి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం (2026-27) నుంచే ఈ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటికే వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న దాదాపు 64,76,590 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా ఆర్థిక సాయం జమ కానుంది.
షెడ్యూల్ విడుదల.. ఆగస్టులోనే కొత్త అడ్మిషన్లకూ లబ్ధి:
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, జూలై 22వ తేదీ నాటికి అర్హులైన తల్లుల ఖాతాల్లోకి ‘తల్లికి వందనం(Thalliki Vandanam Scheme)’ నిధులు విడుదల కానున్నాయి. అదే రోజున ప్రతి గ్రామాలు, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శిస్తారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 3వ తేదీ వరకు స్వీకరించి, ఆగస్టు 10న సప్లిమెంటరీ జాబితాను విడుదల చేస్తారు. ఇక కొత్తగా అడ్మిషన్లు తీసుకునే విద్యార్థుల కోసం ఆగస్టు 25 వరకు గడువు ఇచ్చారు. వీరికి సంబంధించిన అర్హుల జాబితాను ఆగస్టు 30న ప్రకటించి, అదే రోజున వారి తల్లుల ఖాతాల్లో కూడా నగదును జమ చేయనున్నారు.
రూ. 13 వేల జమ.. విద్యా వ్యవస్థల అభివృద్ధికి రూ. 2 వేలు:
ఈ పథకం కింద ప్రతి విద్యార్థి తల్లికి ప్రభుత్వం రూ. 15,000 ఆర్థిక సాయం ప్రకటించినప్పటికీ, అందులో చిన్న మార్పు చేసింది. పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా పర్యావరణ వ్యవస్థల అభివృద్ధి కోసం ‘కంట్రిబ్యూషన్’ కింద రూ. 2,000 మినహాయించుకోనున్నారు. మిగిలిన రూ. 13,000ల ఆర్థిక సాయాన్ని నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్రంలో పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఎంతో దోహదపడనుంది.
