×
Ad

Ambati Rambabu: అంబటి రాంబాబుకు 14 రోజులు రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలింపు

  • Published On : February 1, 2026 / 11:50 PM IST

Ambati Rambabu: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్ కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పోలీసులు అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు అంబటిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అంబటి అరెస్ట్ పై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిందని ఆరోపించారు. ప్రశ్నించినందుకు దాడులు చేస్తారా? అని మండిపడ్డారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని వాపోయారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని.. కేంద్ర హోంశాఖ మంత్రిని కలుస్తాం, కేసులు వేస్తాం, కోర్టుల్లో తేల్చుకుంటాం అని స్పష్టం చేశారు.

కాగా, రిమాండ్ పై వాదనల సందర్భంగా జడ్జి ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు అంబటి. తాను ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆయన వాపోయారు. పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. అర్థరాత్రి వేళ పోలీసులు తనను సెల్ లో నుంచి బయటకు తీసుకొచ్చి, తనను వేధించారని ఆయన ఆరోపించారు. తనపై దాడి చేశారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోలేదని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు.