AP Woman Trapped in Muscat : పవన్ అన్నా.. నన్ను కాపాడండి.. మస్కట్‌లో చిక్కుకొని ఏపీ మహిళ నరకయాతన.. సెల్ఫీ వీడియోతో కాపాడాలంటూ వేడుకలు

AP Woman Trapped in Muscat Seeks : ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన షానాజ్ అనే మహిళ మస్కట్ దేశంలో చిక్కుకుంది. పవన్ కల్యాణ్ అన్నా.. తనను కాపాడండి అంటూ సెల్ఫీ వీడియో ద్వారా వేడుకుంది.

AP Woman Trapped in Muscat

  • మస్కట్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా మహిళ
  • నరకయాతన అనుభవిస్తున్నా కాపాడండి
  • సెల్ఫీ వీడియో ద్వారా పవన్ కల్యాణ్‌ను వేడుకోలు

AP Woman Trapped in Muscat Seeks : ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన షానాజ్ అనే మహిళ మస్కట్ దేశంలో చిక్కుకుంది. నరకయాతన అనుభవిస్తున్నానని, తనను తిరిగి దేశం‌కు రప్పించేందుకు సాయం చేయాలని మహిళ వేడుకుంది. బాత్ రూమ్ నుంచి సెల్ఫీ తీసి వీడియో సన్నిహితులకు పంపిన షానాజ్… తనను కాపాడాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను వేడుకుంది.

Also Read : Gold And Silver Rates : బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన రేటు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

మస్కట్‌లో తాను నరకయాతన అనుభవిస్తున్నానని, తనను ఒక గదిలో బంధించి తాగడానికి నీళ్లు, తిండి కూడా ఇవ్వకుండా బాగా కొడుతున్నారని, తనకు మూర్ఛ కూడా వస్తున్నదని మహిళ కన్నీరు మున్నీరైంది. తనకు ముగ్గురు పిల్లలని, తాను చనిపోతే పిల్లలు అనాధలు అవుతారని మహిళ వాపోయింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారూ నన్ను కాపాడండి.. ఈ నరకం నుంచి నన్ను బయటపడేయండి.. స్వదేశానికి వచ్చేలా సహాయం చేయండి అంటూ మహిళ వేడుకుంది.

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి చెందిన షానాజ్ అనే మహిళ బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లి నరకయాతన అనుభవిస్తున్నారు. తన ముగ్గురు పిల్లల భవిష్యత్తుకోసం అప్పులు చేసి ఏజెంట్ ద్వారా అక్కడికి వెళ్లింది. అయితే, అక్కడ యాజమాని చేతిలో తీవ్ర చిత్రహింసలు ఎందుర్కొటున్నట్లు మహిళల తెలిపింది. తనను గదిలో బందించారని కన్నీరు మున్నీరైంది. తనకు ఏమైనా జరిగితే తన బిడ్డలు దిక్కలేని వారవుతారని, ఎలాగైనా తనను స్వదేశానికి రప్పించి రక్షించాలని ఆ వీడియోలో షానాజ్ దీనంగా వేడుకుంది.