SCR Extension Special Trains : తిరుమల వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ రైలు టైమింగ్స్ మార్చారు.. బెంగళూరుకు ప్రత్యేక రైలు
SCR Extension Special Trains : దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి రద్దీ నేపథ్యంలో పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
- Dharani Pilli
- Updated on- May 1, 2026 / 04:47 PM IST
scr extended danapur smvt bengaluru and hyderabad gorakhpur special trains and extends tirumala express
SCR Extension Special Trains : వేసవి కాలంలో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. దీంతో రైళ్లన్నీ కిటకిటలాడుతుంటాయి. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రైలు ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభమై.. కోస్తా మీదుగా రాయలసీమకు వెళ్తుంది. ప్రస్తుతం తిరుమల ఎక్స్‌ప్రెస్ (18522/18521) విశాఖపట్నం–కడప–విశాఖపట్నం మధ్య నడుస్తోంది. అయితే ఇప్పుడీ రైలును కడపకు కాకుండా గుంతకల్లు వరకు పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
మే 12 నుంచి గుంతకల్లు–విశాఖపట్నం తిరుమల ఎక్స్‌ప్రెస్ (18522).. మే 13 నుంచి విశాఖపట్నం–గుంతకల్లు తిరుమల ఎక్స్‌ప్రెస్ (18521) రెగ్యులర్ సర్వీసుగా ప్రకటించారు.
విశాఖపట్నం–గుంతకల్లు (18521) రైలు విశాఖలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమ్యి.. తర్వాతి రోజు ఉదయం 11.30 గంటలకు గుంతకల్లు చేరుకుంటుంది. ఆ తర్వాత ఉదయం 7.03కి కడప చేరుకుంటుంది.. ఆ తర్వాత యర్రగుంట్ల, కొండాపురం, తాడిపత్రి, గుత్తి మీదుగా గుంతకల్లు చేరుకుంటుంది.
అలానే గుంతకల్లు టు విశాఖపట్నం రైలు (18522) తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1.30 గంటలకు గుంతకల్లు నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు దువ్వాడ, ఆ తర్వాత అరగంటకు అంటే 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
ఏపీ మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైలు
ఇదిలా ఉంటే వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మీదుగా నడిచే పలు ప్రత్యేక రైళ్ల (Special Trains) గడువును పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరీ ముఖ్యంగా.. దానాపూర్ – SMVT బెంగళూరు మార్గంతో పాటు.. హైదరాబాద్ – గోరఖ్‌పూర్ మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. వేసవి సెలవుల కారణంగా రెగ్యులర్ రైళ్లలో టికెట్లు దొరకక ఇబ్బంది పడుతున్న వేలాది మంది ప్రయాణికులకు ఈ పొడిగింపు ఒక వరంగా మారబోతోంది.
ఈ ప్రత్యేక రైలు షెడ్యూల్ ప్రకారం.. దానాపూర్-బెంగళూరు మధ్య నడిచే రైలు విజయవాడ, నెల్లూరు మీదుగా ప్రయాణిస్తుంది. అలాగే హైదరాబాద్-గోరఖ్‌పూర్ వెళ్లే రైలు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి ప్రధాన ప్రయాణ సాధనంగా నిలుస్తోంది. ఈ రైళ్లలో విపరీతమైన రద్దీ ఉండటంతో.. రైల్వే బోర్డు ఈ రైళ్లను మరికొన్ని వారాల పాటు కొనసాగించాలని నిర్ణయించింది. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు, ఐటీ ఉద్యోగులకు మరియు విద్యార్థులకు ప్రయాణం సులభతరం కానుంది.
