Cyclone : నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. రాగల 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశం
మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్ళరాదని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బీ.ఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
- bheemraj
- Published On : December 3, 2023 / 08:59 AM IST
Severe cyclone
Severe Cyclone : నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. రాగల 12 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా తుఫాన్ పయనించనుంది. మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు – మచిలీపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆదివారం నుండి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. మంగళవారం అక్కడక్కడ అతి తీవ్ర భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉంది. సాయంత్రం నుండి కోస్తా తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి.
Michaung Cyclone : ఏపీకి మిచాంగ్ ముప్పు
మత్స్యకారులు బుధవారం వరకు వేటకు వెళ్ళరాదని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బీ.ఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
