Sharmila’s Party: వైఎస్సార్ పుట్టిన రోజే పార్టీ ప్రకటన
తెలంగాణలో షర్మిల పార్టీ ప్రకటన తేదీ ఖరారైంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినమైన జులై 8 తేదీన పార్టీ ప్రకటన చేయనున్నారు షర్మిల.. తన పార్టీకి తండ్రి పేరు కలిసొచ్చేలా వైఎస్సార్ తెలంగాణ పార్టీగా నామకరణం చేశారు షర్మిల
- kunduru Vinod
- Published On : June 7, 2021 / 12:38 PM IST
Sharmila's Party
Sharmila’s Party: తెలంగాణలో షర్మిల పార్టీ ప్రకటన తేదీ ఖరారైంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినమైన జులై 8 తేదీన పార్టీ ప్రకటన చేయనున్నారు షర్మిల.. తన పార్టీకి తండ్రి పేరు కలిసొచ్చేలా వైఎస్సార్ తెలంగాణ పార్టీగా నామకరణం చేశారు షర్మిల. ఇక పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చివరి అంకానికి చేరుకుంది. మార్చి 23 న పార్టీ రిజిస్ట్రేషన్ నిమిత్తం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోగా పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చివరి దశకు చేరినట్లు తెలుస్తుంది. జూన్ 16 వరకు పార్టీ పేరుపై అభ్యంతరాలు రాకపోతే షర్మిల పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటిస్తుంది.
ఇక పార్టీ పేరు విషయంపై షర్మిల తల్లి విజయమ్మ స్పందించారు. పార్టీపేరుపై ఎలాంటి అభ్యంతరాలు లేవని విజయమ్మ తెలిపారు. ఇక పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు షర్మిల టీం సిద్దమవుతుంది ఈనెల 10న మండల, నియోజకవర్గ హడక్ కమిటీలను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆమె అనుచరులు. ఇప్పటికే తొమ్మిది మందితో రాష్ట్రస్థాయి బాధ్యతలను చూసేందుకు హడక్ కమిటీలను నియమించారు షర్మిల.
