Srikakulam: స్టేజ్‌పై సోఫా విరగడంతో కింద పడ్డ బాబాయ్, అబ్బాయ్!
శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు రామ్మోహన్ నాయుడు, టెక్కెలి నియోజకవర్గం శాసన సభ్యులు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అచ్చెన్నాయుడు పాల్గొన్న సభలో అపశ్రుతి చోటు చేసుకుంది.
- vamsi
- Published On : October 13, 2021 / 01:58 PM IST
Babai Abbai
Srikakulam: శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు రామ్మోహన్ నాయుడు, టెక్కెలి నియోజకవర్గం శాసన సభ్యులు, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అచ్చెన్నాయుడు పాల్గొన్న సభలో అపశ్రుతి చోటు చేసుకుంది.
శ్రీకాకుళం బాపూజీ కళామందిర్‌లో సర్దార్ లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభలో వేదికపై సోఫాలో కూర్చుంటుండగా.. సోఫా వెనక్కి జరగడంతో ఎంపీ రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ఇద్దరూ వేదికపై పడిపోయారు.
వెంటనే అప్రమత్తమైన కార్యక్రమం నిర్వాహకులు వారిని పైకిలేపి కుర్చీలను ఏర్పాటు చేశారు. అయితే, ఇద్దరికీ గాయాలేమీ కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు నిర్వాహకులు. బాబాయ్, అబ్బాయ్ ఇద్దరూ సేఫ్‌గానే ఉన్నారని ఎటువంటి గాయాలు కాలేదని వెల్లడించారు తెలుగుదేశం పార్టీ నాయకులు.
