పంచాయతీ ఎన్నికల ఫిర్యాదులకు యాప్

  • Published On : February 3, 2021 / 06:26 AM IST

Andhra Pradesh panchayat : పంచాయతీ ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణకు ఎన్నికల సంఘం ఓ యాప్‌ను అందుబాటులోకి తెస్తోంది. నేరుగా ఎస్ఈసీకి ఫిర్యాదు చేసేలా ఈ- వాచ్‌ మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను 2021, ఫిబ్రవరి 03వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఆవిష్కరించనున్నారు. అక్రమాలు, ప్రలోభాలు, ఇతర సమస్యలు తెలుపొచ్చని ఎస్‌ఈసీ తెలిపారు.

అయితే ఎస్‌ఈసీ తేనున్న యాప్‌పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ తయారుచేసిన యాప్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం తెస్తోందంటూ ఆరోపిస్తున్నారు అధికార పార్టీ నేతలు. ఈ యాప్‌ అందుబాటులోకి వచ్చాక ఫిర్యాదులు చేసుకునే వీలుంటుంది కాబట్టే వైసీపీ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు.