Local Body Elections: ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్.. బీసీలకు 34% రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేత.. సుప్రీంకోర్టు సంచలన కామెంట్స్

Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల వివాదంపై సుప్రీంకోర్టు అత్యంత కీలక తీర్పు వెలువరించింది.

Supreme Court Dismissed AP Government Petition Regarding BC Reservation Local Body Elections

Supreme Court Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల వివాదంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలక తీర్పు వెలువరించింది. స్థానిక పోరులో వెనుకబడిన తరగతులకు (BC) 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు జీవోలను కొట్టివేస్తూ గతంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపడుతూ హైకోర్టు ఇచ్చిన సబబైన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేయడంతో ఏపీ సర్కారుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Read Also – Anil Chandra Punetha: బ్యాలెట్ పేపర్లతోనే ఏపీ స్థానిక పోరు.. న్యూ నోటిఫికేషన్‌కు సర్వం సిద్ధం.. ఎస్ఈసీ పునేఠా కీలక ఆదేశాలు

50 శాతం పరిమితి దాటకూడదు.. డెడికేటెడ్ కమిషన్ నివేదికపై ప్రశ్నలు:

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 34 శాతం బీసీ కోటాతో మొత్తం రిజర్వేషన్ల శాత పరిమితి రాజ్యాంగబద్ధంగా నిర్దేశించిన 50 శాతాన్ని దాటిపోతోందని ధర్మాసనం ధ్వజమెత్తింది. రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ నివేదికను పక్కాగా అమలు చేస్తున్న ఆధారాలు ఎక్కడున్నాయని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇకపై నిబంధనలకు లోబడి, 50 శాతం రిజర్వేషన్ పరిమితికి అనుగుణంగానే స్థానిక సంస్థల పోరుకు (Local Body Elections) షెడ్యూల్ విడుదల చేసేందుకు మార్గం సుగమమైంది.