AP Elections Nominations: వైఎస్సార్‌సీపీకి సుప్రీంకోర్టులో ఊహించని షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్ కొట్టివేత.. ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్!
AP Elections Nominations: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడువు పెంపుపై వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- V Santhosh Kumar
- Updated on- October 27, 2026 / 05:48 PM IST
Supreme court dismisses ysrcp petition on ap local body elections nomination extension
AP Elections Nominations: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల సమర్పణ గడువు వివాదంపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)తోసిపుచ్చింది. నామినేషన్లు వేసేందుకు అదనపు సమయం కేటాయించాలని కోరిన YSRCP అభ్యర్థనను ధర్మాసనం పూర్తిగా నిరాకరించింది. గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన అన్ని మార్గదర్శకాలకు అనుగుణంగానే ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైనందున తాము జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించిన ధర్మాసనం, “ఆల్ ది బెస్ట్.. ఎన్నికలకు వెళ్లండి” అని పేర్కొంటూ స్థానిక పోరు నిర్వహణకు పచ్చజెండా ఊపింది.
Read Also –DA Hike: ఉద్యోగులు, పెన్షనర్లకు పండుగ ధమాకా.. డీఏ పెంపుకు గ్రీన్ సిగ్నల్.. పెరగనున్న జీతాలు
పారదర్శక ఎన్నికలకు స్పష్టమైన ఆదేశాలు.. బెదిరింపులు ఎదురైతే ఆధారాలతో పిటిషన్ దాఖలు చేయవచ్చని సూచన:
ఎన్నికలను సంపూర్ణంగా పారదర్శకంగా, నిష్పాక్షిక వాతావరణంలో పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి అత్యున్నత న్యాయస్థానం కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల పోలింగ్, పరిపాలనా ప్రక్రియ మొత్తాన్ని సీసీ టీవీ కెమెరాల ద్వారా సమగ్రంగా పర్యవేక్షించాలని సూచించింది. ఏవైనా దౌర్జన్యాలు లేదా బెదిరింపుల కారణంగా నామినేషన్ దాఖలు చేయలేకపోయిన అభ్యర్థులు ఉంటే, వారు తగిన సాక్ష్యాధారాలతో విడివిడిగా పిటిషన్లు దాఖలు చేసుకోవడానికి సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది. తదుపరి విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది.
