అసెంబ్లీ సమావేశాలు : టీడీపీ కీలక నిర్ణయం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు ప్రారంభమయ్యాయి. టీడీపీ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు(జనవరి 23,2020) శాసనసభ కార్యక్రమాలను టీడీపీ బహిష్కరించింది.

  • Publish Date - January 23, 2020 / 03:47 AM IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు ప్రారంభమయ్యాయి. టీడీపీ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు(జనవరి 23,2020) శాసనసభ కార్యక్రమాలను టీడీపీ బహిష్కరించింది.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు ప్రారంభమయ్యాయి. టీడీపీ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు(జనవరి 23,2020) శాసనసభ కార్యక్రమాలను టీడీపీ బహిష్కరించింది. అసెంబ్లీకి హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. శానసమండలిలో నిన్న (జనవరి 22,2020) జరిగిన పరిణామాలపై టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అసెంబ్లీలో ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లుని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అమ్మఒడి పథకంపై సభలో చర్చించనుంది.

వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు మండలిలో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తూ మండలి చైర్మన్‌ నిర్ణయం తీసుకున్నారు. కమిటీకి బిల్లు వెళ్లకుండా ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించింది వైసీపీ. అయితే, సంఖ్యా బలం ఉండడంతో.. ముందు నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీడీపీ.. తన పంతం నెగ్గించుకుంది. 

కాగా, మండలి సాక్షిగా వికేంద్రీకరణ బిల్లుపై వైసీపీ, టీడీపీ మధ్య పోరు తారస్థాయికి చేరింది. వికేంద్రీకరణ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించుకున్న ప్రభుత్వం.. మండలిలో మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంది. మండలిలో సంఖ్యా బలం ఎక్కువగా ఉండటంతో ప్రతిపక్షం వ్యూహం పన్నింది. బిల్లులను ఎలాగైనా ఆమోదించుకోవాలని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించినప్పటికీ.. టీడీపీ మాత్రం పట్టుబట్టి మరీ సెలక్ట్‌ కమిటీకి వెళ్లేలా వ్యవహరించింది. దీంతో చైర్మన్‌ తనకున్న విచక్షణాధికారాలు ఉపయోగించి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీకి పంపిస్తున్నట్లు ప్రకటించారు.

బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని మండలిలో యనమల రామకృష్ణుడు డిమాండ్ చేయగా.. అవసరం లేదని మంత్రి బుగ్గన తేల్చి చెప్పారు. మరోవైపు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపడంపై ఓటింగ్‌కు టీడీపీ పట్టుపట్టింది. దీంతో ప్రభుత్వ, ప్రతిపక్ష వర్గాల మధ్య వాదోపవాదనలతో సభ దద్దరిల్లింది. ఒకానొక సమయంలో మండలిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోడియం ఎదుట బొత్స, లోకేష్ వాగ్వివాదానికి దిగారు. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కొడాలి నాని కూడా పోడియం ముందే నిలబడి టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల మీదకు దూసుకు వెళ్లేందుకు కొడాలి నాని యత్నించగా నాని మీదకు దూసుకెళ్లేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు ప్రయత్నించారు. దీంతో కౌన్సిల్ 15 నిముషాల పాటు వాయిదా పడింది.

* నేడు అసెంబ్లీకి టీడీపీ దూరం
* నేటి శాసనసభ కార్యక్రమాలను బహిష్కరించిన టీడీపీ
* అసెంబ్లీకి హాజరు కాకూడదని నిర్ణయం
* నిన్న మండలిలో జరిగిన పరిణామాలకు నిరసనగా టీడీపీ దూరం